Home> ఏపీ
Advertisement

ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. ప్రత్యేక సాయమే: కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది

ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. ప్రత్యేక సాయమే: కేంద్రం

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది. అంతేకాకుండా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక సాయం ప్రకటించామని కేంద్రం వివరించింది. పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశాలపైనే దృష్టి కేంద్రీకరించామని కేంద్ర మంత్రి సభకు వెల్లడించారు. 

ఏపీకి ప్రత్యేక హోదా నినాదం ఇవాళ్టిది కాదు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ వినిపిస్తోంది. కొత్తగా అధికారంలోకొచ్చిన వైఎస్ జగన్ సర్కార్ సైతం రాష్ట్రానికి ప్రత్యేక ఇవ్వాల్సిందిగా కేంద్రంలో రెండోసారి అధికారంలోకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన ఈ సమాధానం రాజకీయంగా ఎటువంటి ప్రకంపనలు సృష్టించనుందో వేచిచూడాల్సిందే మరి. అయితే, భారీ మెజార్టీతో అధికారంలోకొచ్చిన ఎన్డిఏ సర్కార్‌కి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ్వరి మద్దతు అవసరం లేదనేది కూడా ఇక్కడ గమనించదగిన విషయం అంటున్నారు పరిశీలకులు.

Read More