Home> ఏపీ
Advertisement

koneti Adimulam: రాసలీలల ఘటనపై రంగంలోకి చంద్రబాబు.. ఆదిమూలం ఔట్..

Koneti adimulam:  ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రొమాన్స్ వీడియో ఘటనపై... టీడీపీ పార్టీ సీరియస్ అయ్యింది.  ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 

koneti Adimulam: రాసలీలల ఘటనపై రంగంలోకి చంద్రబాబు.. ఆదిమూలం ఔట్..

Adimulam romance video issue viral: వరదల వేళ టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది. టీడీపీ పార్టీకి చెందిన మహిళ నేతపై.. ఎమ్మెల్యే ఆదిమూలం రొమాన్స్ వీడియోలు తెలుగు రాష్ట్రాలలో హల్ చల్ చేస్తున్నాయి. ఏకంగా టీడీపీపార్టీకి చెందిన మహిళ.. హైదరాబాద్ లోని సోమాజిగూలో ప్రెస్ క్లబ్ లో.. మీడియా సమావేశం పెట్టి మరీ తనపై జరిగిన దారుణాన్ని బైటపెట్టింది. తిరుపతిలోని భీమాస్ హోటల్‌లోని రూమ్ నెంబర్ 109 లోకి పిలిచి, అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది.

అక్కడ తనను బెదిరించి తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించాడని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టినట్లు తెలిపింది.

లైంగికంగా తన కోరిక తీర్చకుంటే.. కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితురాలు హైదరబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తన భర్తపై ఘటన వివరాలను వెల్లడించింది. ఈ ఘటన కాస్త పొలిటికల్ గా తీవ్ర రచ్చగా మారింది. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సదరు మహిళ  టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ కు సైతం.. తన పై జరిగిన దారుణాన్ని గుర్చి లేఖను రాశారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Read more: Koneti adimulam: అడ్డంగా దొరికి పోయిన ఎమ్మెల్యే ఆదిమూలం.. వైరల్ గా మారిన రాసలీలల వీడియో..

ఈ క్రమంలో..  టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియగా స్పందించినట్లు తెలుస్తోంది. ఘటనపై తనకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More