Home> ఏపీ
Advertisement

మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి !

విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

 మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి !

అమరావతి: మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడులు చేయడం వంటి ఘటన సాధారణంగా మనం చూస్తున్నాం. అయితే విజయవాడలో సీన్ రివర్స్ అయింది. ఈ ప్రముఖ మీడియా పకథం ప్రకారం విజయవాడ నగరంలో ఓ మైనర్ బాలుడిపై ఓ వివాహిత లైంగిక దాడికి యత్నించింది. తన ఇంట్లోకి పిలిచి..అత్యాచారయత్నం  చేసింది.

బాధితుడు ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని చెప్పాడు.  దీంతో వాళ్లు పోలీస్ స్టేషల్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి వైద్య పరీక్షల కోసం బాలుడిని ఆసుపత్రికి తరలించారు . 

ఫోక్సా చట్టం కింద కేసు నమోదు

బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితురాలిని ఫోక్సా చట్టం (మైనర్ బాలబాలికలపై లైంగిక వేధింపుల చట్టం)  కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మైనర్ బాలబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై ఈ చట్టం కింద కేసు నమోదు  చేస్తారు. కాగా కోర్టు ఆమెను 15 రోజుల పాటు రిమాండ్ విధించింది.  శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపుతోంది.

Read More