Home> ఏపీ
Advertisement

Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్‌కి ఇదే నా వార్నింగ్

Minister Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్ పెద్దా, చిన్నా లేకుండా మాట్లాడుతున్నాడు. మా ఎమ్మెల్యేలను ఉరికించి కొడతా అని లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇస్తున్నాను అని చెబుతూ నేరుగానే నారా లోకేష్‌ని హెచ్చరించారు.  

Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్‌కి ఇదే నా వార్నింగ్

Minister Roja Warns Nara Lokesh: వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కానీ అసలు మా ఎమ్మెల్యేలు 40 మంది మీతో ఎందుకు టచ్‌లో ఉన్నారో అచ్చన్నాయుడు సమాధానం  చెప్పాలి మంత్రి రోజా డిమాండ్ చేశారు. టీడీపీకి నేతలు కరువయ్యారని తరచుగా చెబుతూ వస్తోన్న రోజా.. అచ్చన్నాయుడిని ఉద్దేశించి మాట్లాడుతూ.. " మీకు అభ్యర్ధులు లేక మా ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారా అన్న విషయం చెప్పాలి" అని అచ్చన్నాయుడుని, టీడీపీని ఎద్దేవా చేశారు. పార్టీ లేదు.. బొక్కా లేదు అన్న వ్యక్తి అచ్చన్నాయుడు... వెన్నుపోటు పొడిచి ఇవాళ దివంగత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారు అని మండిపడ్డారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం పార్టీ ఆఫీసులో ఎన్టీఆర్ ఫోటో కూడా పెట్టలేదు. ఎన్టీఆర్ మీద అంత గౌరవం ఉన్న వాళ్లే అయితే.. ఆయన పేరిట ఎందుకు ఒక్క కాలేజీని కూడా పెట్టలేదో చెప్పాలి అని ప్రశ్నించారు. కరివేపాకులా ఎన్టీఆర్ పేరు వాడుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు బతికున్నప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడిచి.. ఆయన కుర్చీనే లాగేసుకుని.. ఇవాళ ఆయన పేరు చెప్పుకుంటున్నారు అంటూ టీడీపీ నేతలకు మంత్రి రోజా చురకలు అంటించారు.

పిల్లగాడు లోకేష్ పెద్దా, చిన్నా లేకుండా మాట్లాడుతున్నాడు. మా ఎమ్మెల్యేలను ఉరికించి కొడతా అని లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇస్తున్నాను అని చెబుతూ నేరుగానే నారా లోకేష్‌ని హెచ్చరించారు. అమ్ముడుపోయిన వ్యక్తులు చెప్పే మాటలను వినే మూడ్ లో ఇప్పుడు ఎవ్వరూ లేరు. అమరావతి ప్రాంతం ఓటర్లు సైతం టిడిపిని ఓడించారు. ఆ విషయం మరచిపోయి ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి అమరావతికి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విస్మయం వ్యక్తంచేశారు. అమరావతి రైతులది ఫేక్ పాదయాత్ర అని గతంలో వ్యాఖ్యానించిన ఎమ్మెల్యేనే... ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతోంది అని ఎమ్మెల్యే శ్రీదేవిపై మంత్రి రోజా మండిపడ్డారు.

ఇది కూడా చదవండి : Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి రాంసింగ్ తొలగింపు, 6 మందితో సిట్ ఏర్పాటు

ఇది కూడా చదవండి : AP Capital Issue: ఏపీ రాజధానిపై తుది విచారణ జూలై 11న, తేల్చిన సుప్రీంకోర్టు

ఇది కూడా చదవండి : AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More