Home> ఏపీ
Advertisement

Chiranjeevi: ఏపీ ఎన్నికలపై మెగాస్టార్‌ చిరంజీవి సంచలన నిర్ణయం.. పవన్‌కల్యాణ్‌కా? జగన్‌కా మద్దతు?

Actor Megastar Chiranjeevi Political Supports In AP Elections: కొన్నేళ్ల తర్వాత రాజకీయాలపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఏపీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతు తెలుపుతూ వీడియో సందేశం ఇచ్చారు.

Chiranjeevi: ఏపీ ఎన్నికలపై మెగాస్టార్‌ చిరంజీవి సంచలన నిర్ణయం.. పవన్‌కల్యాణ్‌కా? జగన్‌కా మద్దతు?

Chiranjeevi Political Statement: చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ రాజకీయ వ్యవహారాలపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా సాగుతున్న ఏపీ ఎన్నికలపై చిరంజీవి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలోనని చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ ప్రకటన తన తమ్ముడు జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌కు మద్దతు ఉందా? లేదా ప్రస్తుత సీఎం జగన్‌కు మద్దతు పలికాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ ఎన్నికలపై చిరంజీవి ఒక వీడియో సందేశం విడుదల చేశారు.

Also Read: TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌

 

'చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాలపై ప్రస్తావించడం ఇప్పుడే జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం తమ్ముడు పవన్‌ కల్యాణ్‌, టీడీపీ నుంచి చంద్రబాబు, బీజేపీ కేంద్ర నాయకత్వం కారణం. ఆ పార్టీలు కూటమిగా ఏర్పడడం సంతోషం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం. నా చిరకాల మిత్రుడు సీఎం రమేశ్‌, నాకు కావాల్సిన వ్యక్తి పంచకర్ల రమేశ్‌. ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు సమర్థవంతులు. మంచివారు. నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతారు. ఈ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. పంచకర్ల రమేశ్‌ నా ఆశీస్సులతో రాజకీయ ప్రవేశం చేశారు. ఏపీ అభివృద్ధిలో ముందుకువెళ్లాలి. దీనికోసం ప్రజలంతా నడుం బిగించాలి. ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలి' అని ఆ వీడియోలో చిరంజీవి‌ తన అభిమానులు, ఏపీ ప్రజలకు వివరించారు.

Also Read: JanaSena: పవన్‌ కల్యాణ్‌కు అనారోగ్యం.. ప్రజలకు జనసేన పార్టీ కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ ద్వారా 21 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేశ్‌ను చిరంజీవి సూచనతోనే పవన్‌ కల్యాణ్‌ ఎంపిక చేశారు. ఇటీవల చిరును పవన్‌ కల్యాణ్‌ కలిసిన విషయం తెలిసిందే. విశ్వంభర షూటింగ్‌లో నాగబాబుతో కలిసి చిరంజీవిని పవన్‌ కలిసి కొన్ని సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి రూ.5 కోట్ల విరాళం జనసేన పార్టీకి ఇచ్చారు. రాజకీయాలకు స్వస్తి పలికిన చిరంజీవి ప్రస్తుతం ఏపీ ఎన్నికలపై స్పందించడం గమనార్హం. త్వరలోనే తమ్ముడు పవన్ కు మద్దతుగా చిరు ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర అనే సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More