Home> ఏపీ
Advertisement

గిరిజనులకు ద్రోహం చేసినందుకే అరకు ఎమ్మెల్యేని చంపాం.. మరో ఎమ్మెల్యేకీ అదే గతి పడుతుంది: మావోయిస్టుల లేఖ

మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ పేరుతో ఎవరో విడుదల చేసిన ఓ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ లేఖలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు సంబంధించిన కారణాలను తెలపడం గమనార్హం. 

గిరిజనులకు ద్రోహం చేసినందుకే అరకు ఎమ్మెల్యేని చంపాం.. మరో ఎమ్మెల్యేకీ అదే గతి పడుతుంది: మావోయిస్టుల లేఖ

మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ పేరుతో ఎవరో విడుదల చేసిన ఓ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ లేఖలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు సంబంధించిన కారణాలను తెలపడం గమనార్హం. ప్రజాకోర్టు నిర్వహించి వారికి విధించిన మరణశిక్షకు కారణం.. వారు గిరిజనులకు చేస్తున్న కీడు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా బాక్సైట్‌ తవ్వకాల విషయంలో ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఎమ్మెల్యే పట్టించుకోలేదని.. అలాగే గూడ క్వారీ విషయంలో కూడా నాయకులు పద్ధతి మార్చకోలేదని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది.

అలాగే ఆ లేఖలో పలు ఇతర విషయాలను కూడా తెలిపారు. మావోయిస్టులు పోలీసులకు ఎలాంటి హానీ కలిగించలేదని.. పొట్టకూటి కోసం పనిచేసే పోలీసులను క్షమించామని.. కానీ మావోయిస్టులు దొరికితే మాత్రం పోలీసులు ఎన్ కౌంటర్ పేరుతో హతమారుస్తున్నారని మావోయిస్టు సెంట్రల్ పేరుతో రాసిన ఆ లేఖలో తెలపడం జరిగింది. తాము బాక్సైట్ తవ్వకాలకు పూర్తిగా వ్యతిరేకమని.. ఈ తవ్వకాలకు ఎవ్వరు మద్దతు పలికినా ఉపేక్షించేది లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. 

అలాగే ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కూడా ఆ లేఖలో బెదిరింపులు చేయడం జరిగింది. ఆమె అధికార పార్టీకి రూ.20 కోట్లకు అమ్ముడైపోయిన తరుణంలో తాము ఆమెకు హెచ్చరికలు జారీ చేస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. గిడ్డి ఈశ్వరి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని.. అలా ఆమె చేయని పక్షంలో అరకు ఎమ్మెల్యేకు పడిన శిక్షే ఆమెకు కూడా పడుతుందని ఆ లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ లేఖ ఎవరు పంపించారన్న విషయంపై మీడియాలో బాగా చర్చ జరుగుతోంది.

Read More