Home> ఏపీ
Advertisement

Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో 3 రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌లో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం సైతం అతలాకుతలమై భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.

Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో 3 రోజులపాటు భారీ వర్షాలు

Next 3 days Heavy Rains in AP and Telangana: హైదరాబాద్: తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (AP) ‌లో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం సైతం అతలాకుతలమై భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8.30గంటలకు మధ్య బంగాళాఖాతం (central bay of bengal)లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ (IMD) అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. రాగల 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతవరణ శాఖ తెలిపింది. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. Also read: Hyderabad Floods: తెలంగాణ‌కు ఢిల్లీ సాయం.. రూ.15 కోట్ల విరాళం ప్రకటించిన కేజ్రీవాల్

ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ (TS) తో పాటు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు.. కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కావున మత్స్యకారులు చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికను సైతం జారీ చేశారు. Also read: NEET 2020 Results: ‘నీట్‌’గా లేదు.. ఆలిండియా టాపర్‌ సైతం ఫెయిల్‌

ఇదిలాఉంటే.. ఇప్పటికే కురిసిన వర్షాలతో ( Hyderabad Floods ) అతలాకుతలమైన హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం కూడా వర్షం కురిసింది. తాజాగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరం మరోసారి వరదలతో నష్టపోయే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారు. 

 Also read: Hyderabad floods: నేటి నుంచే వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More