Home> ఏపీ
Advertisement

Heavy Rains Alert: ఏపీలో మరో 3-4 రోజుల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక

Heavy Rains Alert: ఓ వైపు బంగాళాఖాతంలో..మరోవైపు అరేబియా సముద్రంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా మరో 3-4 రోజుల్లో ఏపీలో అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Heavy Rains Alert: ఏపీలో మరో 3-4 రోజుల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక

Heavy Rains Alert: ఓ వైపు బంగాళాఖాతంలో..మరోవైపు అరేబియా సముద్రంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా మరో 3-4 రోజుల్లో ఏపీలో అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతంలో(Bay of Bengal)ఒకేసారి అల్పపీడన ప్రభావం ఏర్పడింది. అరేబియా సముద్రంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడగా..బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది కాస్తా నవంబర్ 9వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. అదేవిధంగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి ఉంది. ఈ నెల 9వ తేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం బలపడి వాయవ్య దిశగా పయనించనుంది. ఫలితంగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. మరో 3-4 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరిస్తోంది. 

Also read: TTD: మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More