Home> ఏపీ
Advertisement

Rains Alert: ఏపీకు గుడ్‌న్యూస్, ఈనెల 15 నుంచి మళ్లీ వర్షాలు

Rains Alert: తెలుగు రాష్ట్రాలకు ఊరటనిచ్చే చల్లని కబురు ఇది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Rains Alert: ఏపీకు గుడ్‌న్యూస్, ఈనెల 15 నుంచి మళ్లీ వర్షాలు

Rains Alert: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింందంది. మరోవైపు ఈశాన్య, తూర్పు గాలులు బలపడనుండటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ముఖ్యంగా ఏపీకు వర్షసూచన జారీ అయింది. 

గత కొద్దికాలంగా ఏపీ, తెలంగాణల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ నెలలో అయితే ఒక్క వర్షం కూడా లేకపోవడంతో రైతాంగం అల్లాడిపోయింది. నవంబర్ నెల ప్రారంభంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడటంతో అన్నదాతలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు మరో శుభవార్త వాతావరణ శాఖ నుంచి అందుతోంది. ఈ నెల 15న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందో లేదో ఇంకా స్పష్టత లేకపోయినా ఈశాన్య, తూర్పు గాలుల ప్రభావంతో 15 తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు పడవచ్చు. 

ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నిన్నటికి బలహీనపడింది. మరోవైపు తుపాను ఆవర్తనం తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈనెల 15న మరో అల్పుపీడనం ఏర్పడనుండటంతో వచ్చేవారం వర్షాలు ఊపందుకోవచ్చు. ఇప్పటికే నాలుగు రోజుల క్రితం ఏపీలో భారీ వర్షాలు నమోదయ్యాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు పడ్డాయి. అటు ప్రజలకు ఇటు రైతాంగానికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. ఏలూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాలు, శీ సత్యసాయి, తిరుపతి, పల్నాడు, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల 15 తరువాత పడవచ్చు. 

Also read: Bank Holidays: ఈనెలలో బ్యాంకు పనులుంటే జాగ్రత్త, వరుసగా ఐదురోజులు నో బ్యాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More