Home> ఏపీ
Advertisement

కోటప్పకొండ తిరుణాళ్ళకు భారీ ఏర్పాట్లు

మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ దేవస్థానంలో ఉత్సవాలు నిర్వహించడం అనేది అనేక సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం.

కోటప్పకొండ తిరుణాళ్ళకు భారీ ఏర్పాట్లు

మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ దేవస్థానంలో ఉత్సవాలు నిర్వహించడం అనేది అనేక సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ సంవత్సరం కూడా ఆ  సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఉత్సవాలను భారీ స్థాయిలో చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. తెలంగాణలో మేడారం జాతర తర్వాత తెలుగు రాష్ట్రాలలో జరిగే అతి పెద్ద జాతరగా  కోటప్పకొండ జాతరకు పేరుంది. ఇప్పటికే కోటప్పకొండ తిరుణాళ్ళకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండగ హోదా కల్పించడంతో ఈ సారి ఈ ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోటప్పకొండలోని చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు  మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.

Read More