Home> ఏపీ
Advertisement

బాగా ఆస్తులున్న అభ్యర్థుల్లో తెలంగాణ నేత టాప్

బాగా ఆస్తులున్న ఎంపీల్లో తెలంగాణ ఎంపీ టాప్ 

బాగా ఆస్తులున్న అభ్యర్థుల్లో తెలంగాణ నేత టాప్

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా అనేక పార్టీల అధినేతలు, పలువురు కీలక నేతలు తమ అభ్యర్థిత్వాన్ని నమోదు చేసుకుంటూ నామినేషన్ దాఖలు చేసుకుంటున్నారు. అలా నామినేషన్ దాఖలు చేసుకున్న వారిలో చాలామంది నేతలు ఆర్థికంగా బాగా ఉన్నవారే కాగా వారిలోనూ కొంతమంది నేతలు మరొకరికి అందనంత ఎత్తులో వున్నారు. అలా చూసుకుంటే అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలతో జతచేసిన అఫిడవిట్ పత్రాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తుల పరంగా అందరికన్నా ముందు వరుసలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఎంపీగా గెలిచిన ఆయన ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్‌ అఫిడవిట్‌లో పొందుపర్చిన వివరాల ప్రకారం ఆయనకు రూ.895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇక ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన మంత్రి నారాయణ తనకు రూ. 650 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు రూ.339 కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. 

వైఎస్సార్సీపీ తరపున నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేస్తోన్న పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజుకు రూ.324 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆయన అఫిడవిట్‌ స్పష్టంచేస్తోంది. అలాగే గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తనకు రూ.266 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ తనకు రూ.200 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తోన్న అతి కొద్దిమంది అభ్యర్థుల వివరాలు మాత్రమే. మొత్తంగా తీసుకుంటే ఈ సంఖ్య ఇంకా చాలానే వుండనుంది.

Read More