Home> ఏపీ
Advertisement

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ హస్తం తీర్ధం !

                                       

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ హస్తం తీర్ధం !

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా అంటే..తాజా పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, పల్లంరాజులు బుధవారం హైదరాబాద్‌లోని కిరణ్‌ నివాసానికి వెళ్లి చర్చలు జరపడం జరిగింది. ఈ సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి వారి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం. కాగా సమావేశం అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డిని  తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చినట్లు విలేకరుతో చెప్పడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  విభజన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి గత నాలుగేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై దృష్టి  సారించారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన్ను కలవడం.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుత పరిణామాలను చూస్తే కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే మొగ్గుచూపే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More