Home> ఏపీ
Advertisement

Road Accident: ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురి దుర్మరణం

Kadapa Road Accident: కడప జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురి దుర్మరణం

Kadapa Road Accident: కడప జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఓ ఆటో ముద్దనూరు నుంచి చిన్నదుద్యాల గ్రామానికి వెళ్తోంది. పులివెందుల నుంచి ప్రొద్దుటూరు మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆ ఆటోను ఢీకొట్టింది.

ముద్దనూరు బీఎస్‌ఎన్‌ఎల్(BSNL)‌ కార్యాలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. 

Also Read: Ammavodi Status: జగనన్న అమ్మ ఒడి స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఆటో, బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతివేగం, వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు(Road Accident) సంభవిస్తున్నాయి. అమయాకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లు రక్తమోడుతున్నాయి.

Also Read: ​WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More