Home> ఏపీ
Advertisement

'ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది'..: జూనియర్ ఎన్టీఆర్

Jr NTR : ఏపీ అసెంబ్లీ ఘటనపై తాజాగా జూ.ఎన్టీఆర్ స్పందించారు. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం అరాచక పాలనకు నాందిగా ఆయన పేర్కొన్నారు. 
 

'ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది'..: జూనియర్ ఎన్టీఆర్

Jr NTR : ఏపీ అసెంబ్లీలో ప్రతి పక్షనేత చంద్రబాబు(Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneshwari )పై పలువురు నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా జూ. ఎన్టీఆర్(Jr NTR) ట్విట్టర్ వేదికగా  స్పందించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.

వీడియోలో ఏమన్నారంటే...‘‘అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచి వేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుంది. స్త్రీ జాతిని గౌరవించటం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవ జీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి. అంతేకానీ, మన సంస్కృతిని కలచి వేసి, కాల్చేసి ఇదే రాబోయే తరాలకు  బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు’’

Also Read: ఖబడ్దార్... విర్రవీగితే మెడలు వంచుతాం... వైసీపీ నేతలకు నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్...

Also Read: నారా భువనేశ్వరికి పురంధేశ్వరి సంఘీభావం... నైతిక విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని...

‘‘ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ దేశానికి చెందిన ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా’’అని ఎన్టీఆర్‌ భావోద్వేగంతో మాట్లాడారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Read More