Home> ఏపీ
Advertisement

నేడు ఢిల్లీలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

అమరవీరుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం అందజేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో పవన్ కోటి రూపాయల చెక్కును అందిస్తారు.

నేడు ఢిల్లీలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

అమరావతి: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 20న రెండు ముఖ్యమైన కార్యక్రమాలలో పవన్ పాల్గొననున్నట్లు జనసేన కార్యాయం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని జనసేన అధినేత పవన్ సందర్శించనున్నారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి జనసేన పార్టీ తరఫున కోటి రూపాయల చెక్కును ఈ సందర్భంగా సైనికాధికారులకు పవన్ అందచేస్తారు. ఇటీవల ఆర్మీ డే సందర్భంగా అమరులైన సైనికుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం విదితమే.

అనంతరం విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ పాల్గొంటారు. దేశానికి యువత అవసరం ఉందని, యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడానికి ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జనసేన అధినేత సమాధానాలు ఇస్తారు. పవన్ కల్యాణ్ గురించి రూపొందించిన లఘుచిత్రాన్ని (షార్ట్ ఫిలిం) ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు.

See Pics: అందాల గేట్లు ఎత్తేసిన భామలు  

కాగా, మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్డో ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య  సింధియా, ఇతర కీలక నేతలు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన ప్రకటనను ఆయన రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ బుధవారం విడుదల చేశారు.

Also Read: తెలంగాణలో డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More