Home> ఏపీ
Advertisement

పవన్ బర్త్ డే సందర్భంగా 'స్పెషల్ సాంగ్' రిలీజ్

ఈ రోజు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు.

పవన్ బర్త్ డే సందర్భంగా 'స్పెషల్ సాంగ్' రిలీజ్

ఈ  రోజు జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు . ఈ సందర్బంగా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు  ఆయనకు శుభాకాంక్షలు తెలుపునుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో పవన్ బర్త్ డే ప్లైక్లీలతో హోరెత్తిస్తూ జనసేనికులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదిలాఉంటే పవన్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ  'స్పెషల్ సాంగ్’ విడుదల చేసింది.   'అడుగొక్కటి వెనుకపడితే నీ చరిత్ర ముగుస్తుందా....? నీ ఆశయ సిద్ధాంతపు సెగ మంటను దహిస్తుందా ? నీ పుట్టుక జాతి కొరకు.... నీ మనుగడ నీతి కొరకు..... భరతమాత ముద్దుబిడ్డ.. నీ పయనం ప్రజల కొరకు' అంటూ సాగుతున్న ఉద్వేగభరితంగా పాట తెగ అదరగొట్టేస్తోంది.  తాజాగా రిలీజ్ చేసిన ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   మరి ఆ స్పెషల్ సాంగ్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి మరి...

 

Read More