Home> ఏపీ
Advertisement

AP: జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ

New CS For AP: ఆంధ్రప్రదేశ్‌ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలంలో ఈనెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబర్‌ 1న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 

AP: జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ

Andhra Pradesh new chief secretary : ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా సమీర్‌ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 1 నుంచి సమీర్‌ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ సమీర్‌ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. సమీర్‌ శర్మ(Sameer Sharma) ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఈ నెల 30న ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేయనున్నారు.

ప్రస్తుతం సమీర్ శర్మ సెంట్రల్ సర్వీసెస్‌లో కొనసాగుతున్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే.. సమీర్‌ శర్మ కూడా రెండు నెలల్లో.. పదవీ విరమణ చేయనున్నారని సమాచారం. ఈ తరుణంలో ఆయన రాష్ట్ర కేడర్‌ను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. బాధ్యతలు చేపట్టిన అనంతరం సమీర్‌ శర్మ(Sameer Sharma) పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read: Ganesh chaturthi in AP: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై AP High court నిర్ణయం

అయితే అంతకుముందు జూన్‌ 26 ప్రభుత్వం ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి(Chief secretary)గా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌(adityanath das) పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఆదిత్యనాథ్‌దాస్‌ జూన్ 30తో పదవీవిరమణ చేయాల్సి ఉండగా.. ఆయన సర్వీసును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సీఎస్‌ పదవీకాలాన్ని మూడు నెలలపాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ 1987 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Read More