Home> ఏపీ
Advertisement

Prashanth Kishore: వైఎస్ జగన్ ఓటమి ఖాయం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..

Andhra Pradesh Elections: ఆంధ్ర ప్రదేశ్‌ లో తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమిఖాయమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంలో తీవ్ర చర్చనీయాంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్లు చేశారు.

Prashanth Kishore: వైఎస్ జగన్ ఓటమి ఖాయం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..

Political Strategist Comments Over AP CM YS Jagan: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఇప్పటికే ఎండకాలం కంటే ముందుగా పొలిటికల్ హీట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే అధికారంలో ఉన్న వైఎస్సార్పీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175  అంటూ ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే నేతలకు దిశానిర్దేషం చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకోసం చేపట్టిన పథకాలు, డెవలప్ మెంట్ కార్యక్రమాలను ప్రజలకు చెప్పి తమకు ఓటు వేయాలని కోరాలని చెప్పారు. ఇక మరోవైపు.. తెలుగు దేశం పార్టీ, జనసేన లు పొత్తులు ఖరారైపోయాయి. ఇప్పటికే ఆయా స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు కూడా ఖరారైపోయారు. అటూ ఏపీ కాంగ్రెస్ లో ఇటీవల చేరిన వైఎస్ షర్మిల కూడా జగన్ పై తీవ్రమైన విమర్శలను చేస్తున్నారు. పదేండ్ల పాటు.. బీజేపీకి వైఎస్సార్సీపీ గులాంగీరి చేసిందని ఎద్దేవా చేశారు.

Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!

ప్రజలను ఉచిత పథకాలతో నిండా ముంచుతున్నారన్నారు. నిరుద్యోగులను వైఎస్సార్సీపీ నిండా ముంచిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను తేవడంలో జగన్ విఫలమయ్యారని వైఎస్ షర్మిల పలు మార్లు విమర్శించారు. ఇక ఏపీలో ఒక్కస్థానం గెలవకున్న కూడా.. బీజేపీ కాళ్లదగ్గర వైఎస్సార్సీపీ ఉంటుందని షర్మి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు ఏపీలో హ్యాట్రిక్ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ భావిస్తుంది.

ఇక తెలుగు దేశం కూడా తన ఉనికిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక వైఎస్ షర్మిల కూడా తమను గెలిపిస్తే.. ఏపీకి ప్రత్యేక హోదామీద రాహుల్ తో తొలిసంతకం చేయిస్తానని కూడా పలుమార్లు ప్రజలకు సభల్లో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారాయి. 

హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తొందరలో జరగబోయే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదని,ఉద్యోగ కల్పన, భవిష్యత్తుపై నమ్మకం అన్నారు.

Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..

వైఎస్సార్సీపీ ప్రజలను సోమరిపోతులుగా చేస్తుందని, చదువుకున్న వారు ఉద్యోగాలులేక రోడ్ల మీద తిరుగుతున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇక.. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అనేక సర్వేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మరోసారి అధికారం చేరపడతారని  చెప్పినట్లు పేర్కొన్నారు. ఏది ఏమైన గతంలో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More