Home> ఏపీ
Advertisement

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వర్షం కురిసిందంటే..? మండలాల వారీగా రిపోర్ట్ ఇదే..!

AP Rains Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలతో అలమటించిన ప్రజలు భారీ వర్షంతో ఉపశమనం పొందారు. కానీ ఊహించని రీతిలో భారీ వర్షం కురవడంతో ఏపీలో విషాద సంఘటనలు.. పంట నష్టం చోటుచేసుకున్నాయి.

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వర్షం కురిసిందంటే..? మండలాల వారీగా రిపోర్ట్ ఇదే..!

AP Weather Report: ఉరుములు మెరుపులకు తోడు గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం ఆంధ్రప్రదేశ్‌ను తడిసి ముద్ద చేసింది. ఈ వేసవికాలం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉక్కపోత, ఎండ వేడిమితో అలమటించిన ఏపీ ప్రజలకు వర్షాలు ఊరట కలిగించాయి. కానీ భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గాలివానకు పంటలు నేలకొరిగాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కొన్ని చోట్ల విషాదం నింపింది. గోడలు కూలి కొందరు మృతి చెందారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాల్లో మండలాలవారీగా కురిసిన వర్షాపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: AP and Telangana Rain Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్

 

కోనసీమ, యానం     
మార్కాపురం (ప్రకాశం జిల్లా) 10, ఉదయగిరి (నెల్లూరు) 8, సీతారామపురం (నెల్లూరు) 7, గుడివాడ (కృష్ణా జిల్లా) 7, తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా) 7, మర్రిపూడి (ప్రకాశం జిల్లా), పొదిలి (ప్రకాశం జిల్లా) 5, జంగమహేశ్వరపురం (పల్నాడు జిల్లా) 5, నెల్లూరు (నెల్లూరు జిల్లా) 5, మాచర్ల (జిల్లా పల్నాడు) 5, అద్దంకి (బాపట్ల జిల్లా) 5, పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) 5, కొయ్యలగూడెం 5, నందిగామ (ఆర్‌) (ఎన్టీఆర్ జిల్లా) 4, కొనకనమిట్ల (ప్రకాశం జిల్లా) 4, సత్తెనపల్లె (పల్నాడు జిల్లా) 4, ముండ్లమూరు (ప్రకాశం జిల్లా) 4, నందిగామ (ఎన్టీఆర్ జిల్లా) 3, మచిలీపట్నం (కృష్ణా జిల్లా) 3, చోడవరం (అనకాపల్లి జిల్లా) 3, పెద్దాపురం (కాకినాడ జిల్లా) 3, రాచర్ల (ప్రకాశం జిల్లా) 3, చీమకుర్తి (ప్రకాశం జిల్లా) 3, యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా) 3, ఆత్మకూర్ (నెల్లూరు జిల్లా) 3, అచ్చంపేట (3, పల్నాడు జిల్లా), సంతమాగులూరు (బాపట్ల జిల్లా ) 3, అమలాపురం (బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ) 2, ఒంగోలు (ప్రకాశం జిల్లా) 2, మెంటాడ (విజయనగరం జిల్లా) 2, కంబం (ప్రకాశం జిల్లా) 2, వెలిగండ్ల 2, తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా ) 1, దర్శి (ప్రకాశం జిల్లా) 1, గుంటూరు (గుంటూరు జిల్లా) 1, బేస్తవారిపేట (ప్రకాశం జిల్లా) 1, వింజమూరు (నెల్లూరు జిల్లా ) 1, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) బారంపట్ల 1, తుని (కాకినాడ జిల్లా) 1, భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) 1.

Also Read: Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటే

 

రాయలసీమ     
ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) 10, రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) 10, పోరుమామిళ్ల (వైఎస్సార్ జిల్లా) 8, దువ్వూరు (వైఎస్సార్ జిల్లా) 8, మదనపల్లె (అన్నమయ్య జిల్లా) 7, జమ్మలమడుగు 7, వల్లూరు (వైఎస్సార్ జిల్లా) 7, ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా) 6, కడప (వైఎస్సార్ జిల్లా) 6, పుంగనూరు (చిత్తూరు జిల్లా) 6, చాపాడు (వైఎస్సార్ జిల్లా) 6, అట్లూరు (వైఎస్సార్ జిల్లా) 6 , కమలాపురం (వైఎస్సార్ జిల్లా) 5, బద్వేల్ (వైఎస్సార్ జిల్లా) 5, కుప్పం (చిత్తూరు జిల్లా) 5, కోడూరు (వైఎస్సార్ జిల్లా) 5, రాజంపేట (అన్నమయ్య జిల్లా) 5, గుత్తి (అనంతపురం జిల్లా) 5, రుద్రవరం (నంద్యాల జిల్లా) 5, బ్రహ్మసముద్రం (అనంతపురం జిల్లా) 4, నంద్యాల (నంద్యాల జిల్లా) 4, జూపాడు బంగ్లా (నంద్యాల జిల్లా) 4, నందికొట్కూరు (నంద్యాల జిల్లా) 4, పుల్లంపేట (అన్నమయ్య జిల్లా) 4, పీపల్లి (నంద్యాలగిరి జిల్లా), కోట (చిత్తూరు జిల్లా) 3, పెనగలూరు (అన్నమయ్య జిల్లా) 3, ఆత్మకూర్ (అనంతపురం జిల్లా) 3, రాయచోటి (అన్నమయ్య జిల్లా) 3, సెట్టూరు (అనంతపురం జిల్లా) 3, పలమనేరు (చిత్తూరు జిల్లా) 3, దొర్నిపాడు 3 (నంద్యాల జిల్లా), ఆరోగ్యవరం (అన్నమయ్య జిల్లా) 3, శాంతిపురం (చిత్తూరు జిల్లా) 3, లేపాక్షి (శ్రీ సత్యసాయి జిల్లా) 3, తనకల్ (శ్రీ సత్యసాయి జిల్లా) 2, పామిడి (అనంతపురం జిల్లా ) 2, అమరాపురం (శ్రీ సత్యసాయి జిల్లా) 2, అనంతపురం (అనంతపురం జిల్లా) 2, ఆమడగూర్ (శ్రీ సత్యసాయి జిల్లా) 2, రాప్తాడు (అనంతపురం జిల్లా ) 2, తంబళ్లపల్లె (అన్నమయ్య జిల్లా) 2, తాడపత్రి (అనంతపురం జిల్లా) 2, సింగనమల (అనంతపురం జిల్లా) 2, ఆత్మకూర్ (నంద్యాల జిల్లా ) 1, పత్తికొండ (కర్నూలు జిల్లా) 1, కొండాపురం (వైఎస్సా‌ఆర్ జిల్లా) 1, ముద్దనూరు (వైఎస్సార్ జిల్లా) 1, గుమ్మగట్ట (అనంతపురం జిల్లా) 1, వేంపల్లె (వైఎస్సార్ జిల్లా) 1, సంబేపల్లె (అన్నమయ్య జిల్లా) 1, చిత్తూరు (చిత్తూరు జిల్లా) 1, ఓర్వకల్ (కర్నూలు జిల్లా ) 1, రామగిరి (శ్రీ సత్యసాయి జిల్లా) 1, బత్తలపల్లె (శ్రీ సత్యసాయి జిల్లా) 1, పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా) 1, కోయిల‌కుంట్ల (నంద్యాల జిల్లా) 1, కలకడ (అన్నమయ్య జిల్లా) 1, చిన్నమండెం (అన్నమయ్య జిల్లా) 1, కర్నూలు (కర్నూలు) 1, సింహాద్రిపురం (కడప జిల్లా) 1, గూడూరు (తిరుపతి జిల్లా) 1, కళ్యాణదుర్గం (అనంతపురం జిల్లా) 1, బనగానపల్లె (నంద్యాల జిల్లా) 1, ఆస్పరి (కర్నూల్ జిల్లా) 1, ఓబులదేవరచెరువు (శ్రీ సత్యసాయి జిల్లా) 1, హిందూపూర్‌ (శ్రీ సత్యసాయి జిల్లా) 1, గుంతకల్లు (అనంతపురం జిల్లా) 1.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More