Home> ఏపీ
Advertisement

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు టీడీపీ షాక్.. అతిగా ఊహించుకోవద్దని గోరంట్ల సెటైర్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయమని ప్రచారం సాగుతుండగా.. ఊహించని పరిణామం జరిగింది. పవన్ కల్యాణ్ కు ఝలక్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత. పొత్తులపై జనసేనాని ఆదివారం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు టీడీపీ షాక్.. అతిగా ఊహించుకోవద్దని గోరంట్ల సెటైర్

Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయమని ప్రచారం సాగుతుండగా.. ఊహించని పరిణామం జరిగింది. పవన్ కల్యాణ్ కు ఝలక్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత. పొత్తులపై జనసేనాని ఆదివారం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పవన్ కల్యాణ్ అతిగా ఊహించుకుంటున్నారంటూ ట్వీట్ చేశారు. ఖ్యింటా కాట తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి...కానీ ఆ కొన్ని వడ్లు వల్లనే మొత్తం కాట తుగింది అనుకుంటే ఎలా....సేనాధిపతి...! అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత చేసిన కామెంట్లు ఏపీలో రాజకీయ చర్చగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన పొలిటికల్ హీట్ పెంచింది. పవన్ కామెంట్లతో 2014 తరహాలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా పొత్తులకు సిద్ధమనే సంకేతం ఇచ్చారు. అయితే పొత్తులపైనే మరోసారి క్లారిటీ ఇచ్చిన జనసేన చీఫ్... కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు మూడు ఆప్షన్లు ఉన్నాయన్నారు. గతంలో త్యాగాలు చేశామని... ఇప్పుడు ఇతర పార్టీలే త్యాగాలు చేయాల్సి ఉందన్నారు. టీడీపీ తగ్గాల్సిందే అన్నట్లుగా మాట్లాడారు పవన్. తాము ఒంటరిగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ తగ్గాల్సిందే అంటూ పవన్ చేసిన ప్రకటనపై తమ్ముళ్లలో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది.

బీజేపీ-జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఉంటారనే ప్రచారం చాలా రోజులుగా ఉంది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజే ఈ ప్రకటన చేశారు. జనసేన నేతలు కూడా పవనే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు మాత్రం సీఎం పదవిపై మాట్లాడటం లేదు. పవన్ ను కూటమి ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా  అంగీకరించడానికి టీడీపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతఉందని భావిస్తున్న టీడీపీ.. తమకు వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమనే ధీమాలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం సీటును త్యాగం చేసే ఆలోచన చంద్రబాబు చేయబోరనే టాకే రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. తాజాగా పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ తో పవన్ విషయంలో టీడీపీ క్లారిటీగా ఉందని తెలుస్తోంది. గోరంట్ల ట్వీట్ పై జనసైనికులు మండిపోతున్నారు. దీనిపై జనసేన చీఫ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

READ ALSO: Hyderabad Gang Rape: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు? గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు..

READ ALSO: Hyderabad Rape Case: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. వీడియోలు షేర్ చేసిన వ్యక్తికి నోటీస్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More