Home> ఏపీ
Advertisement

TTD Latest News: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. నడక మార్గపు దివ్య దర్శనం టోకెన్లు జారీ

TTD Latest News: వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి. 

TTD Latest News: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. నడక మార్గపు దివ్య దర్శనం టోకెన్లు జారీ

TTD Latest News: వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో దేశం నలుమూలల నుంచి భక్తులు వెంకన్న దర్శనం కోసం వస్తుంటారు. అయితే, అలా భారీ సంఖ్యలో వచ్చే భక్తులతో రద్దీ అధికమై క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్ 1 నుంచి నడక మార్గంలోనే దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్ల క్రితం ఈ ప్రక్రియను నిలిపేశారు. 

అయితే, క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఏప్రిల్ 1నుంచి దివ్య దర్శన టోకెలను పునఃప్రారంభిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గతంలోనే ప్రకటించింది. అప్పుడు చెప్పిన విధంగానే తాజాగా వేసవి సెలవులను దృష్ట్యా భక్తుల రద్దిని నివారించేందుకు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో దివ్య దర్శనం టోకెన్లను జారీ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. 

fallbacks

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తిరుమలకు కాలి నడకన వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి. వీలైనంత త్వరగా దర్శనం చేసుకునే వెసులుబాటు కూడా కలగనుంది. అలిపిరి మార్గంలో రోజుకు 10 వేల టోకెన్లు, శ్రీవారి నడక మార్గంలో 5 వేల టోకెన్లను వారం రోజులు ప్రయోగాత్మకంగా జారి చేయనున్నారు.

ఇది కూడా చదవండి : SSC Exams: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. విద్యార్థులకు కీలక సూచనలు

కాలి నడకన దర్శనం కోసం వచ్చే వారికి ఈ సౌకర్యం ఎంతో ఊరటనివ్వనుంది అంటున్నారు భక్తులు. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ కారణంగా నిలిపి వేసిన ఈ దివ్య దర్శనం టోకెన్ల జారీని ఎట్టకేలకు ఇప్పుడు ప్రారంభించడంపై తిరుమలకు కాలి నడకన వచ్చే భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమై భక్తుల ఇబ్బందులను తొలగించడంలో ఆశించిన ఫలితాలు వెలువడినట్టయితే.. ఇకపై కూడా ఇదే పద్దతిని కోనసాగిస్తాం అని టిటిడి బోర్డు చైర్మన్ తెలిపారు.

ఇది కూడా చదవండి : AP Government: ఏపీలో ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, పదవ తరగతి పరీక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More