Home> ఏపీ
Advertisement

AP Government: ఆర్టీసీ ఉద్యోగులకు మరో వరం, పదోన్నతుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. అటు ఉద్యోగ సంఘాలు సైతం దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
 

AP Government: ఆర్టీసీ ఉద్యోగులకు మరో వరం, పదోన్నతుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government: పదోన్నతి అంశమై గత కొద్దికాలంగా ఆర్టీసీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. పదోన్నతుల్లో పాత నిబంధనలే వర్తిస్తాయని చెప్పడంతో ఉద్యోగ సంఘాలు ఆనందంగా ఉన్నాయి. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా అధికారంలో వచ్చాక ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. వాస్తవానికి ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఆర్టీసీ కార్మికుల కోరికే అయినా నిబంధనల ప్రకారం కొన్ని ప్రయోజనాలు దూరమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగుల పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి ఉద్యోగ సంఘాలు. కార్పొరేషన్ నిబంధనల ప్రకారం కాకుండా  ప్రభుత్వ శాఖల నిబంధనల ప్రకారం పదోన్నతులు ఉండటం వల్ల తమకు అన్యాయం జరుగుతుందనేది ఉద్యోగుల ఆవేదన. విలీనం చేశాక ప్రభుత్వ అర్హతలు, నిబంధనలతో అన్యాయం జరుగుతోందనే చర్చ మొదలైంది.

ఉద్యోగుల సమస్యపై పరిశీలన చేసిన ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు పాత విద్యార్హతల ప్రకారమే పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఉద్యోగులకు గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఇక పదోన్నతులు లభించనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విలీనానికి ముందు పదవ తరగతిలోపు విద్యార్ఙత ఉన్నా పదోన్నతితో పాటు ఏఏఎస్ ఇంక్రిమెంట్లలో ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం 2019 డిసెంబర్ 31 నాటికి అంటే ఆర్టీసీ విలీనం కంటే ముందున్న 50 వేలమందికి రిటైర్ అయ్యేవరకూ పాత నిబంధనల మేరకే పదోన్నతులు కలుగుతాయి. 

Also read: Chandrababu Case Updates: చంద్రబాబును వెంటాడుతున్న ఇతర కేసులు, ఇవాళ హైకోర్టులో విచారణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More