Home> ఏపీ
Advertisement

Godavari Floods: ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: భారీ వర్షాలతో గోదావరి నది మరోసారి పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Godavari Floods: ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయానికి పరిస్థితి మారిపోయింది. రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక ఉంటే ఇవాళ ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక దాటేసింది. గంటల వ్యవధిలోనే గోదావరి ప్రవాహం పెరుగుతోంది. 

దాదాపు నెల రోజుల విరామం తరువాత గోదావరి మరోసారి ఉప్పొంగుతోంది. ఎగువ నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దఎత్తున నీరు చేరుతోంది. ఒక్క రాత్రిలోనే 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు చేరింది. నిన్న రాత్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 12.10 అడుగులుండగా 10 లక్షల 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి. కానీ గోదావరికి భద్రాచలం దిగువన శబరి నది పోటెత్తుతూ గోదావరిలో వచ్చి కలుస్తుండటంతో భారీగా వరద పెరిగింది.  ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 14.2 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఏకంగా 13 లక్షల 37 వేల క్యూసెక్కు నీరు సముద్రంలోకి వదులుతున్నారు. వరద 14 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటితే దిగువన ఉన్న లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంటుంది. కోనసీమలో గౌతమి, వైనతేయ, వశిష్ట నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అప్పనపల్లి సహా కొన్ని కాజే వేలు నీట మునిగాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన అంటే భద్రాచలం ప్రాంతంలో రహదారులు నీట మునగడంతో చింతూరు నుంచి చట్టి, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఎటపాక, చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాల్లో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్టులో 10.31 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. 

అటు ఏలేరు రిజర్వాయర్‌లో భారీగా వరద వచ్చి చేరుతోంది. ఏలేరు రిజర్వాయర్ నుంచి 18,760 క్యూసెక్కుల నీటిని కాలువలోకి వదులుతున్నారు. మరోవైపు కృష్ణా నది నీటి ప్రవాహం మాత్రం తగ్గుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి 1 లక్షా 93 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 

Also read: Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More