Home> ఏపీ
Advertisement

ఏపీలో మరో గ్యాస్ లీకేజీ కలకలం

ఇటీవల విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ విషాదాన్ని మరిచిపోకముందే మరో ప్రాంతంలో గ్యాస్ లీకేజీ కావడం కలకలం రేపింది. భారీ శబ్ధంతో గ్యాస్ లీకేజీ కావడంతో వేమవరం గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ఏపీలో మరో గ్యాస్ లీకేజీ కలకలం

ఇటీవల విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ విషాదాన్ని మరిచిపోకముందే మరో ప్రాంతంలో గ్యాస్ లీకేజీ కావడం కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలం వేమవరంలో బుధవారం గ్యాస్ లీక్ అయింది. భారీ శబ్ధంతో గ్యాస్ లీకేజీ కావడంతో వేమవరం గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

బోర్ మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ పైప్ లీక్ అయినట్లు తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు, అధికారులు స్థానికులకు ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  విశాఖ గ్యాస్ లీక్ ఘటనను తలుచుకుని స్థానికులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

 

Read More