Home> ఏపీ
Advertisement

AP Railway Projects: ఎన్నికల వేళ ఏపీ రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయింపు

AP Railway Projects: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊరట కల్గించే అంశమిది. మద్యంతర బడ్జెట్ రైల్వే కేటాయింపుల్లో ఏపీకు ప్రాధాన్యత లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

AP Railway Projects: ఎన్నికల వేళ ఏపీ రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయింపు

AP Railway Projects: ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కొద్దిమేర ప్రయోజనం కల్గిందనే చెప్పవచ్చు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ సంబంధిత ప్రాజెక్టులకు నిధులు పెరగడం విశేషం. ఏపీకు చెందిన ఏయే ప్రాజెక్టులకు ఏ మేరకు లబ్ది చేకూరనుందో తెలుసుకుందాం.

మరి కొద్దిరోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఏపీకు ఊరట లభించిందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇవి కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అండర్ రైల్వే బ్రిడ్జిలు, రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధుల కేటాయింపు చేసింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి నిధులు పెంచింది. 

ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు మొత్తం 9,138 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.  గత బడ్జెట్‌లో 8,406 కోట్లు కేటాయిస్తే అంతకుముందు అంటే 2022-23లో 7,032 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఈసారి 732 కోట్లు అధికంగా కేటాయింపులు జరిగాయి. ఈసారి బడ్జెట్‌లో ఏ ప్రాజెక్టుకు ఏంత కేటాయించారో పరిశీలిద్దాం.

అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 425 కోట్లు

విజయవాడ-గూడూరు మూడవ లైన్ నిర్మాణానికి 500 కోట్లు

కోటిపల్లి-నరసాపురం కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్లు
కాజీపేట్-విజయవాడ మూడవ లైన్ నిర్మాణానికి 310 కోట్లు
విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ బైపాస్ లైన్ల అభివృద్ధికి 209.8 కోట్లు
ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి 407 కోట్లు
ఫుట్ ఓవర్ బ్రిడ్జి, హై లెవెల్ ప్లాట్ ఫాంల నిర్మాణానికి 197 కోట్లు
రాజమండ్రి గోదావరి నదిపై రైల్వే వంతెన నిర్వహణకు 30 కోట్లు
రాష్ట్రంలోని వందేభారత్ రైళ్ల నిర్వహణకు 10 కోట్లు

మొత్తానికి గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఏపీకు రైల్వే కేటాయింపులు పెరగడంతో పనులు కాస్త వేగవంతమయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఎప్పట్నించో ఊరిస్తున్న కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభం కావచ్చు.

Also read; AP Assembly Elections: కొన్ని రోజుల్లో ఏపీలో మోగనున్న అసెంబ్లీ సమరం.. ఈసీ కీలక సమీక్ష

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More