Home> ఏపీ
Advertisement

జనసేనకు జేడి గుడ్ బై

మాజీ సీబీఐ జేడి లక్ష్మీ నారాయణ జనసేన పార్టీకి వీడ్కోలు పలికారు. జనసేన పార్టీ నిర్ణయాల పట్ల కొద్దిరోజులుగా  అసంతృప్తిగా ఉన్న లక్ష్మీనారాయణ, కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో జేడీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు

జనసేనకు జేడి గుడ్ బై

అమరావతి : మాజీ సీబీఐ జేడి లక్ష్మీ నారాయణ జనసేన పార్టీకి వీడ్కోలు పలికారు. జనసేన పార్టీ నిర్ణయాల పట్ల కొద్దిరోజులుగా  అసంతృప్తిగా ఉన్న లక్ష్మీనారాయణ, కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో జేడీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పంపారు. లేఖలో, మాజీ సీబీఐ  జేడీ, పవన్ కళ్యాణ్ పై స్పందిస్తూ .. స్థిరమైన సైదాంతిక భావాలు లేనప్పుడు రాజకీయాలు చేయలేమని, జనసేన వైఖరిపై ఆయన మండిపడ్డారు. ఈ కారణంగానే తాను జనసేన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

ఏపీ ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, లక్ష్మీ నారాయణ మధ్య విభేదాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ పుకార్లను ఆయన ఖండించారు. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌తో, జనసేన క్యాడర్ తో కలిసి ప్రజా అందోళనల్లో పాల్గొన్నారు. ఇదిలావుండగా, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో లక్ష్మీ నారాయణ కలత చెందారని, పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖపట్నం లోకసభకు పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More