Home> ఏపీ
Advertisement

తుపాను విషయంలో ఒడిషాకు అభయమిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు

ఫొని తుపాను ముందుకొస్తున్న నేపత్యంలో ఏపీ, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సహయక చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి

తుపాను విషయంలో ఒడిషాకు అభయమిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు

ఫొని తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీ, ఒడిషా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందస్తు చర్యల..తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చేంచేందుకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తుఫాన్ ఎదుర్కొనే వ్యూహంపై చర్చించారు.ఈ సందర్భంగా ఏపీ, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సహయక చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. తుఫాను ముందస్తు, సహాయక చర్యల విషయంలో ఒడిషాకు అన్ని రకాల సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు భరోసా ఇచ్చారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుఫాను వాయువేగంతో దూసుకొస్తోంది. రేపు మధ్యాహ్నానికల్లా తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. రేపు మధ్యాహ్నం గోపాల్ పూర్ - దాంద్ బలి వద్ద తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. ఈ సమయంలో దీని ప్రభావంతో ఒడిషాతో పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే క్రమంలో పెనుగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. 

వాతావరణశాఖ హెచ్చరిలతో అప్రమత్తమైన ఏపీ సర్కార్  తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కళింగ పట్నం, బీముని పట్నం ఓడరేవుల్లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖ, గంగవరం పోర్టులో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికల జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను అంచాన వేసిన చంద్రబాబు సర్కార్ ఆయా ప్రాంతాల నుంచి  జనాలను సురక్షిత ప్రాంతాలను తరలించే చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు రాష్ట్రంలో చర్యలు తీసుకుంటూనే మానవతావ దృక్పధంతో పక్క రాష్ట్రానికి సహయం అందించాలని ఏపీ  సర్కార్ భావిస్తోంది.

Read More