Home> ఏపీ
Advertisement

FIR On Chandrababu Naidu: చంద్రబాబు నాయుడిపై ఎఫ్ఐఆర్.. అంగళ్లలో స్పీచ్ ఎఫెక్ట్

FIR Filed On Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసు స్టేషన్‌లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ముదివేడు పోలీసులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు.

FIR On Chandrababu Naidu: చంద్రబాబు నాయుడిపై ఎఫ్ఐఆర్.. అంగళ్లలో స్పీచ్ ఎఫెక్ట్

FIR Filed On Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసు స్టేషన్‌లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ముదివేడు పోలీసులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు. ప్రాజెక్టులు సందర్శన పేరుతో అంగళ్లులో సందర్శించిన చంద్రబాబు నాయుడు అక్కడి టిడిపి కార్యకర్తలను ప్రభుత్వంపైకి, సీఎం వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలపైకి రెచ్చగొడుతూ ప్రసంగం చేశారని ఆరోపిస్తూ కురబలకోట మండలం దాదంవారిపల్లి గ్రామానికి చెందిన డి.ఆర్ ఉమాపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

డి.ఆర్ ఉమాపతి ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ముదివేడు పోలీసులు.. ఈ కేసులో A1 గా నారా చంద్రబాబు నాయుడు , A2 గా మాజీ మంత్రి దేవినేని ఉమ , A3 గా అమర్నాథ్ రెడ్డి ,  A4 గా రాంభూపాల్ రెడ్డి , A5 గా షాజహాన్ భాష , A6 గా దొమ్మలపాటి రమేష్ , A7 గా కిషోర్ కుమార్ రెడ్డి , A8 గా ఘంటా నరహరి , A9 శ్రీరామ్ చినబాబు ,  A10 గా శ్రీధర్ వర్మ , A11 గా ఆర్ శ్రీనివాస్ రెడ్డి , A12 పులివర్తి నాని , A 13 గా ఎం రాంప్రసాద్ రెడ్డి , A14 గా ఫటాన్ ఖాదర్ ఖాన్ , A15 గా వై జి రమణ ఉన్నారు.

ఇది కూడా చదవండి : Bhola Shankar: భోళాశంకర్ సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయమిదే

అలాగే A16 గా వై జి సురేంద్ర , A17 గా రాచకొండ మధుబాబు , A18 గా పర్వీన్ తాజ్, A19 గా ఏలగిరి దొరస్వామి నాయుడు, A20 గా నారాయణస్వామి రెడ్డి పేర్లు ఉన్నాయి. వీళ్లే కాకుండా వీళ్లతో పాటు ఇంకొంతమంది టీడీపీ నేతల పేర్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్టు తెలుస్తోంది. క్రైమ్ నెంబర్ 79 /2023 120B, 147, 145, 153, 307, 115, 109, 323, 324, 506, R/w149 ipc సెక్షన్ల కింద ముదివేడు ఎస్సై  ముబిన్ తాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల పుంగనూరు విధ్వంసం కేసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అబాసుపాలైన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి : Punganuru Violence Case: పుంగనూరు ఘటనలో 62 మంది టిడిపి నాయకులు అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More