Home> ఏపీ
Advertisement

West Godavari Bus Accident: జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాకు కారణాలివే..!!

Eyewitness reveals facts about bus accident in West Godavari: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు (RTC bus plunges into stream) సంబంధించి ప్రత్యక్షసాక్షి ఒకరు పలు విషయాలు వెల్లడించాడు. బస్సు ప్రమాదానికి కారణాలను వివరించాడు.

West Godavari Bus Accident: జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాకు కారణాలివే..!!

Eyewitness reveals facts about bus accident in West Godavari:  పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు (RTC bus plunges into stream) సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంలో గాయపడిన సోమశేఖర్ అనే వ్యక్తి పలు విషయాలు వెల్లడించాడు. ప్రమాద సమయంలో అతను డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చొన్నాడు. బస్సు స్టీరింగ్ పట్టేయడం వల్లే ప్రమాదం జరిగిందని... ఆ సమయంలో డ్రైవర్ ఎంత ప్రయత్నించినా స్టీరింగ్ తిరగలేదని తెలిపాడు. దీంతో బస్సు అదుపు తప్పి వాగులో పడిపోయిందని చెప్పాడు.

జల్లేరు వాగు బ్రిడ్జిపై రెయిలింగ్ లేకపోవడం కూడా ప్రమాదానికి (RTC Bus accident) కారణమైందన్నాడు. డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చొన్నందునా... స్టీరింగ్ పట్టేసిన విషయం గమనించినట్లు తెలిపాడు. బస్సు డ్రైవర్ నీటిలో మునిగిపోయి ఊపిరాడక చనిపోయాడని... తాను బస్సు నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నానని చెప్పాడు. బయటకు వచ్చాక 108కి ఫోన్ చేసి సమాచారమిచ్చినట్లు తెలిపాడు.

గతంలోనూ ఈ ఆర్టీసీ బస్సులో ఇదే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఫిట్‌నెస్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. మరోవైపు, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు కొత్తదేనని చెబుతోంది.

రెండు రోజుల క్రితం జంగారెడ్డిగూడెం మండల పరిధిలోని జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాగులో పడిపోయిన (Bus Accident) సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 10 మంది దుర్మరణం చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మిగతా ప్రయాణికులను స్థానికులను కాపాడారు. కొంతమంది ప్రయాణికులు తమంతట తామే బస్సు కిటికీల నుంచి క్షేమంగా బయటకు రాగలిగారు. మృతులను దుర్గారావు (డ్రైవర్), ద్వారకా తిరుమలకు చెందిన సరోజిని, చిన్నం వారి గౌడెంకు చెందిన మధుబాబు, తాడువాయికి చెందిన జాన్, నందిగౌడెంకి చెందిన సత్యవతి, జంగారెడ్డి గూడెంకి చెందిన మహాలక్ష్మి, ప్రసాద్, బుల్లెమ్మగా గుర్తించారు. ప్రమాద ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: 156 Kidney stones: ఆ పేషెంట్ కిడ్నీ నుంచి 156 రాళ్లు తొలగించిన వైద్యులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More