Home> ఏపీ
Advertisement

SP Rishant Reddy: పక్కా ఆధారాలతోనే మాజీ మంత్రి నారాయణ అరెస్టు

SSC Paper Leakage Case: పక్కా వ్యూహం, ప్రణాళిక ప్రకారమే మాల్ ప్రాక్టీసు, పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజ్ జరిగిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్టు చేశామో వివరించారు.
 

SP Rishant Reddy: పక్కా ఆధారాలతోనే మాజీ మంత్రి నారాయణ అరెస్టు

SSC Paper Leakage Case: పక్కా వ్యూహం, ప్రణాళిక ప్రకారమే మాల్ ప్రాక్టీసు, పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజ్ జరిగిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్టు చేశామో వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంపై తీగ లాగితే డొంకంతా కదిలింది. వాట్సప్ నుంచి లీకైన పరీక్ష పత్రాలు ఏయే నంబర్ల నుంచి ఫార్వర్డ్ అయ్యాయో పోలీసులు గుర్తించారు. నిందితుల ఛైన్ లింక్ పరిశీలిస్తే..నారాయణ కళాశాలల ఛైర్మన్, మాజీ మంత్రి నారాయణ వరకూ వ్యవహారం సాగింది. పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో నారాయణను అరెస్టు చేసి ఏపీకు తరలించారు. ఈ అరెస్టు వ్యవహారంపై చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడారు.

నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్ చేశారని..ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతున్నారని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. నారాయణలో చదివే విద్యార్ధుల్ని రెండు గ్రూపులుగా విభజించి..ఆ విద్యార్ధులు ఎక్కడ పరీక్ష రాస్తారో తెలుసుకుని హెడ్ ఆఫీసు నుంచి కీ తయారు చేసి విద్యార్ధులకు పంపిస్తారని చెప్పారు. నారాయణతో పాటు తిరుపతి డీన్‌గా ఉన్న బాల గంగాధర్‌ను సైతం అరెస్టు చేశారు. నిందితుల వాంగ్మూలం, సాంకేతిక ఆధారాలతో నారాయణను అరెస్టు చేసినట్టు ఎస్పీ రిశాంత్ రెడ్డి వివరించారు. గతంలో కూడా ఈ తరహా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయని..నారాయణను కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. 

అటెండర్లు, సిబ్బంది ద్వారా ముందస్తు ప్రణాళిక ప్రకారమే మాల్ ప్రాక్టీసు,పేపర్ లీకేజ్ జరిగిందని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. ఇతర విద్యాసంస్థల పాత్రపై కూడా దర్యాప్తు ప్రారంభించామన్నారు. నారాయణ సతీమణిని అరెస్టు చేయలేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో చాలామంది పాత్ర ఉందని చెప్పారు. 

Also read: Cyclone Asani Live Updates: తీవ్ర తుపాను మారిన 'అసని'... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More