Home> ఏపీ
Advertisement

Jai Bharat National Party: ఏపీలో మరో రాజకీయ పార్టీ.. 'జై భారత్ నేషనల్ పార్టీ' ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ..

JD Lakshmi Narayana Political Party: ఏపీలో మరో రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. 'జై భారత్ నేషనల్' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. ఈ మేరకు శుక్రవారం పార్టీ వివరాలను వెల్లడించారు జేడీ.
 

Jai Bharat National Party: ఏపీలో మరో రాజకీయ పార్టీ.. 'జై భారత్ నేషనల్ పార్టీ' ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ..

JD Lakshmi Narayana Jai Bharat National Party: ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 'జై భారత్ నేషనల్' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్న జేడీ.. అవినీతిని నిర్మూలించి.. బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకే తమ జై భారత్‌ నేషనల్‌ పార్టీ వచ్చిందని ఆయన అన్నారు. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలే తమ పార్టీ చేసి చూపుతుందని జేడీ చెప్పుకొచ్చారు. రాజకీయాలన్నీ కుటుంబపాలన చూట్టే తిరుగుతున్నాయని..ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

చీకటిలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడంతోపాటు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తాము తప్పు చేయం.. అప్పు చేయమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఏపీ అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని... ఇక్కడే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత చాలా ఇబ్బందులు పడుతున్నారని.. సరైన పాలసీలు లేకపోవటమే దీనికి కారణంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇకపై బూటకపు రాజకీయాలకు స్వస్తి పలకాలని జేడీ పిలుపునిచ్చారు. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలమని... వారి ఆకాంక్షలను నెరవేర్చటమే తమ ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు. 

Also read: Sajjala Ramakrishna Reddy: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు సజ్జల సలహా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Read More