Home> ఏపీ
Advertisement

Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్‌.. టీజర్‌లో 'గాజు గ్లాస్‌' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!

EC Response Ustaad Bhagat Singh Glass Dialogues: ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా పవన్‌కల్యాణ్‌ తన సినిమా టీజర్‌ విడుదల చేసి అందులో 'రాజకీయ డైలాగ్‌'లు పెట్టారనే వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ సందర్భంగా పవన్‌కు ఈసీ....

Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్‌.. టీజర్‌లో 'గాజు గ్లాస్‌' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!

Election Commission: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వేళ రాజకీయ సినిమాలు వస్తున్నాయి. తాజాగా పవన్‌కల్యాణ్‌ తాను నటిస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' సినిమాలో రాజకీయాలపై డైలాగ్‌లు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఆ డైలాగ్‌లపై తీవ్ర చర్చ జరుగుతోంది. జనసేన పార్టీకి మద్దతునిచ్చేలా.. సినిమా ద్వారా ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరిక చేసేలా ఆ సినిమా టీజర్‌లో పలు డైలాగ్‌లు ఉన్నాయి. ఈ డైలాగ్‌లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాలని అధికార వైఎస్సార్‌సీపీతోపాటు ఇతర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమా డైలాగ్‌లపై ఎన్నికల సంఘం స్పందించింది. సినిమాల్లో రాజకీయ డైలాగ్‌లపై ఈసీ కీలక వ్యాఖ్యలు చేసింది.

Also Read: AP Elections: ఎన్డీయే కూటమిలో చిచ్చు రేపిన పరిపూర్ణానంద స్వామి.. కూటమిలో కుంపటేనా?

 

సినిమాలను అడ్డం పెట్టుకుని పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం చేస్తున్నారనే విషయమై బుధవారం ఎన్నికల సంఘం స్పందించింది. ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ.. 'పవన్‌కల్యాణ్‌ సినిమా టీజర్‌ ఇంకా చూడలేదు. ఎవరు ఏ గుర్తుకు మద్దతుగా అయినా ప్రచారం చేసుకోవచ్చు. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి' అని చెప్పి పవన్‌కు షాకిచ్చారు. ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేస్తే మాత్రం ముందస్తు అనుమతి తప్పనిసరి' అని స్పష్టం చేశారు. గాజు గ్లాస్‌ గుర్తుపై ప్రచారం చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు అని పేర్కొన్నారు.

Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్‌.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' సినిమాకు సంబంధించిన టీజర్‌ను మంగళవారం చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాస్‌ గుర్తుపైనే ప్రధానంగా డైలాగ్‌లు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నవీన్‌ ఎర్నేనీ, రవిశంకర్‌ యలమంచిలి నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More