Home> ఏపీ
Advertisement

Deisel Missing Case: ఏపీఎస్‌ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం..దొంగలు ఎవరో తెలుసా..?

Deisel Missing Case: కాకినాడ జిల్లాలో డీజిల్ మాయం వెనుక ఇంటి దొంగల పనేనన్న అనుమానాలు కల్గుతున్నాయి. ఆ దిశగా అధికారులు సైతం విచారణ చేస్తున్నారు.

Deisel Missing Case: ఏపీఎస్‌ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం..దొంగలు ఎవరో తెలుసా..?

Deisel Missing Case: కాకినాడ జిల్లాలో డీజిల్ మాయం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య రద్దీగా ఉంటే తుని ఆర్టీసీ డిపోలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 11 వేల లీటర్లకుపైగా డీజిల్ కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. గ్యారేజీ వద్ద భూమిలో ఉన్న డీజిల్ మాయం కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్యాంకర్ లీకైందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

డీజిల్ మాయమైన ఘటన మంగళవారమే గుర్తించినట్లు తెలుస్తోంది. ఐనా అధికారులు ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నత అధికారుల స్థాయిలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ విజిలెన్స్ బృందం రంగంలోకి దిగింది. ట్యాంకర్ లీకేజీతోనే డీజిల్ కనిపించడం లేదా..ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

గత కొంతకాలంగా తుని ఆర్టీసీ డిపో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. చమురు విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలోనే ఇలాంటి ఘటనలు జరిగాయన్న ప్రచారం ఉంది. దీనిపై లోతుగా విచారణ జరగాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వ సొమ్మును కొందరు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Also read:Repo Rate Hike: రెపో రేటు పెంపు... ఆర్‌బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై పెరగనున్న వడ్డీ రేట్లు...

 

Also read: Hyderabad Murder Case: పోలీసులకు చిక్కిన కాల యముడు..విచారణలో కీలక విషయాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Read More