Home> ఏపీ
Advertisement

AP కాకినాడ సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం

deep depression in bay of bengal |  వాయుగుండం తీరం దాటడంతో దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

AP కాకినాడ సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం

ఏపీలోని కోస్తా ప్రాంతం, తెలంగాణ (Telangana), మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rainfall) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నరసాపురం - కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. కాకినాడ (Kakinada) దగ్గర 17 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన వాయుగుండం తీరాన్ని తాకిందని అధికారులు చెబుతున్నారు. అయితే మరికొంత సమయానికి పూర్తిగా తీరాన్ని దాటనుందని తెలిపారు.

 

వాయుగుండం తీరం దాటడంతో దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచించారు. కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఇదివరకే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు.

Also Read : Weather Updates: మరింత బలపడిన వాయుగుండం.. భారీ వర్షాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Read More