Home> ఏపీ
Advertisement

Cyclone Alert: మండు వేసవిలో బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక

Cyclone Alert: మండు వేసవిలో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలుల ప్రమాదం కూడా పొంచి ఉంది. 

Cyclone Alert: మండు వేసవిలో బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక

Cyclone Alert: మండు వేసవిలో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలుల ప్రమాదం కూడా పొంచి ఉంది. 

దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది ఇది క్రమంగా వాయగుండంగా మారి..రేపటిలోగా తుపానుగా పరివర్తనం చెందనుంది. రేపు తూర్పు, మధ్య బంగాళాఖాతంపై ఈ తుపాను ఏర్పడనుంది. మే 10 నాటికి వాయవ్యదిశగా కదులుతూ..పశ్చిమ వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాన్ని దాటనుంది. అక్కడ్నించి తిరిగి వాయువ్య బంగాళాఖాతంవైపు పయనించనుంది. 

వాయుగుండం, తుపాను కారణంగా రానున్న మూడ్రోజులపాటు ఉత్తర కోస్తాంధ్రలో మోస్తురు వర్షాలు పడే అవకాశాలున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఒకట్రెండు  ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక రేపు, ఎల్లుండ కూడా మోస్తరు వర్షాలు ఉరుములతో పడనున్నాయి. ఇక దక్షిణ కోస్తాంధ్రలో సైతం ఉరుములతో కూడిన జల్లులు, మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. రేపు, ఎల్లుండ కూడా మోస్తరు వర్షాలు పడవచ్చు.                             

ఇక రాయలసీమల కూడా తుపాను ప్రభావంతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు పడనున్నాయి. రేపు , ఎల్లుండ కూడా మోస్తరు వర్షాలు పడనున్నాయి.

Also read: AP Politics: వచ్చే ఎన్నికల్లో రాబోయేది ఆ పార్టీయేనా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More