Home> ఏపీ
Advertisement

ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా నలుగురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు (AP CoronaVirus Cases ) వందకు చేరువ అవుతున్నాయి. రోజురోజుకూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రతిరోజూ 10వేలకు పైగా శాంపిల్స్ పరీక్షిస్తున్నారు. ఏపీ సర్కార్ భారీగా పటిష్ట చర్యలు తీసుకుంటుంది.

ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా నలుగురి మృతి

Andhra Pradesh Corona Positive Cases | ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కి చేరింది. తాజాగా నలుగురు వ్యక్తులు కరోనాతో మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కోవిడ్19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 96కి చేరింది.  చైనా నుంచి 10 మంది భారత జవాన్లు, అధికారులు విడుదల

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 17,609 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 465 కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో రాష్ట్రంలో ఉన్నవారిలో 376 కేసులు రాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 99 కోవిడ్ కేసులు నిర్ధారించారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆగస్టులో Niharika నిశ్చితార్థం, కాబోయే భర్తతో నిహారిక ఫొటోలు వైరల్

ఏపీలో ఇప్పటివరకూ 3,065 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ కాగా, 3,069 మంది చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 308 కరోనా కేసులుండగా, ప్రస్తుతం 261 యాక్టీవ్ కేసులున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 1423 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 630 యాక్టీవ్ కేసులున్నాయి. తాజాగా 51 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. #APFightsCorona జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Read More