Home> ఏపీ
Advertisement

COVID-19: జేసీబీతో కరోనా రోగి మృతదేహం తరలింపు.. సీఎం జగన్ సీరియస్

COVID-19 patient funeral: అమరావతి: కరోనావైరస్‌ని నివారించాలంటే కరోనావైరస్‌తో యుద్ధం చేయాలి కానీ.. కరోనా సోకిన రోగితో కాదు అని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నప్పటికీ.. అక్కడక్కడ కరోనా సోకిన వారి పట్ల అధికారులు, జనం వ్యవహరిస్తున్న తీరు మాత్రం మారడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు మరణించగా.. ఆయన మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది జేసీబీతో స్మశానవాటికకు తరలించడం సంచలనం సృష్టించింది.

COVID-19: జేసీబీతో కరోనా రోగి మృతదేహం తరలింపు.. సీఎం జగన్ సీరియస్

COVID-19 patient funeral: అమరావతి: కరోనావైరస్‌ని నివారించాలంటే కరోనావైరస్‌తో యుద్ధం చేయాలి కానీ.. కరోనా సోకిన రోగితో కాదు అని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నప్పటికీ.. అక్కడక్కడ కరోనా సోకిన వారి పట్ల అధికారులు, జనం వ్యవహరిస్తున్న తీరు మాత్రం మారడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు మరణించగా.. ఆయన మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది జేసీబీతో స్మశానవాటికకు తరలించడం సంచలనం సృష్టించింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ( Palasa municipality) పరిధిలోని ఉదయపురం గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా మున్సిపల్ అధికారులు చేరుకొని డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనావైరస్ పాజిటీవ్ అని తేలింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనతో పరుగులు పెట్టారు. చివరకు మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని జేసీబీ బకెట్‌ ద్వారా తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన అక్కడున్నవారందరినీ తీవ్రంగా కలచివేసింది.

అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..
పలాసలో కరోనాతో చనిపోయిన వృద్ధుడి శవాన్ని జేసీబీతో స్మశానవాటికకు తరలించిన ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో వెంటనే ఏపీ సీఎంవో (ap cmo) ఈ ఘటనపై స్పందించింది. సీఎంఓ అధికారులు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ నివాస్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం పలాస మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్స్‌పెక్టర్ రాజీవ్‌ను సస్పెండ్ చేశారు. కరోనా సోకిన వారి విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటివకే ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలను జారీ చేసిందని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.

సీఎం జగన్ సీరియస్..
పలాసలో మృతదేహాన్ని జేసీబీతో తీసుకెళ్లిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో ఇలా వ్యవహరించడం తగదంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy) ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా రిపీట్ కాకూడదంటే బాధ్యులపై చర్యలు తీసుకోకతప్పదని పేర్కొన్నారు.

అప్పుడైనా గౌరవించండి.. మాజీ సీఎం చంద్రబాబు
కరోనావైరస్ లక్షణాలతో మరణించిన వారి మృతదేహాలను ఇలా తరలించడం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని చంద్రబాబు ( Chandrababu Naidu) ట్వీట్ చేశారు. కనీసం చావులోనైనా గౌరవించాలన్నారు. ఇంత అమానవీయంగా వ్యవహరించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Read More