Home> ఏపీ
Advertisement

Corona Effect: తిరుపతిలో నేటి నుంచి కొత్త రూల్

ఏపీలో కరోనా తీవ్రత చిత్తూరు జిల్లాలోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి పైన పడుతోంది. ఈ క్రమంలో కాస్త కఠినంగా వ్యవహరించడంతో పాటు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తిరుపతిలోని ట్రేడ్ యూనియన్స్ (Tirupati Trade Union) చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Corona Effect: తిరుపతిలో నేటి నుంచి కొత్త రూల్

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు (CoronaVirus Cases in Andhra Pradesh) పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టెస్టుల సంఖ్య పెంచిన తర్వాత కోవిడ్ పాజిటివ్ కేసులు సైతం భారీగానే నమోదవుతున్నాయి. మరోవైపు గత నెలలో శ్రీవారి ఆలయం తెరుచుకున్న తర్వాత చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా ప్రభావం తీవ్రమైంది. విజయవాడ తరహాలో పరిస్థితి అదుపు తప్పుతోంది. దీంతో నేటి నుంచి తిరుపతి (Tirupati)లో కొన్ని మార్పులు ఉండబొతున్నాయి. COVID-19: రష్యాలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలను మూసివేయాలని తిరుపతి వ్యాపార సంఘాలు (Tirupati Trade Union) స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాయి. కేవలం మెడికల్, వైద్య సంబంధిత షాపులు మాత్రమే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తెరిచి ఉంటాయని, ఇతరత్రా దుకాణాలు మూసివేయాలని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. తప్పనిసరి పనులుంటేనే ప్రజలు ఇళ్ల నుంచి బటయకు రావాలని అధికారులు సైతం సూచిస్తున్నారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

తిరుపతిలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్తక సంఘాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని గమనించి ప్రజలు నర్ణీత సమయంలోపే తమకు కావలసిన సరుకులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించి బయటకు రావాలని కోరుతున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Read More