Home> ఏపీ
Advertisement

AP Govt: డీఏ చెల్లింపునకు సీఎం జగన్ ఒకే.. అందుకే జాప్యం: ఏపీఎన్జీవో

AP Govt Employees DA: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ఉద్యోగ సంఘం ఒక విధంగా వ్యవహరిస్తోంది. రెండు సంఘాలు విమర్శలు.. ప్రతి విమర్శలకు దిగుతున్నాయి. తమకు సమయానికి జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరగా.. డీఏ పెంపునకు సీఎం జగన్‌ను కలిశారు ఏపీఎన్జీవో సంఘం నాయకులు. 
 

AP Govt: డీఏ చెల్లింపునకు సీఎం జగన్ ఒకే.. అందుకే జాప్యం: ఏపీఎన్జీవో

AP Govt Employees DA: సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వాల్సిన డీఏను చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఒకే చెప్పారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ తెలిపారు. సంక్రాంతికి మూడు రోజులు హాలీ డేస్ రావడంతో సర్క్యులర్ జారీ చేయడంలో ఆలస్యమైందని సీఎంవో అధికారులు చెప్పారని అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని బండి శ్రీనివాస్‌తో పాటు కార్యవర్గ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా చెల్లించాల్సిన డీఏను ముఖ్యమంత్రికి గుర్తుచేశారు ఏపీఎన్జీవో సంఘం నాయకులు. దీంతో వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలు గవర్నర్‌ను కలవడాన్ని తప్పుబట్టారు. ఉద్యోగ సంఘాలు నిబంధనలు పాటించాలని.. లేకపోతే గుర్తింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. సమస్యలపై పోరాటం చేయలేకే.. వాళ్లు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెనుక ఎవరు ఉండి పనిచేస్తున్నారో ఉద్యోగులు అంతా గమనిస్తున్నారని అన్నారు. వాళ్లు ఇలాగే వ్యవహరిస్తే ఇక నుంచి సహించేది లేదని హెచ్చరించారు. ఏపీఎన్జీవో సంఘాన్ని హేళన చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. 

అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వినతిపత్రం అందజేశారు. ఇందుకోసం చట్టం చేయాలని కోరారు. తమకు జీతభత్యాలు, డీఏ, పీఆర్సీ బకాయిలు, పీఎఫ్‌ క్లెయిమ్‌లు, మెడికల్‌ క్లెయిమ్‌లు సకాలంలో ఇవ్వకపోవడంతో గవర్నర్‌ను కలిశామన్నారు. 

ఉద్యోగుల సమస్యలపై తాము ఉద్యమం చేద్దామంటే ప్రభుత్వం నిర్బంధం విధిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. తమ సంఘాల్లో చీలిక తెస్తోందని.. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యమంపై నీళ్లు చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నెల జీతం నెల చెల్లించకపోవడంతో ఆందోళన బాటపట్టాల్సి వస్తోందన్నారు. ఏప్రిల్‌లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

Also Read: Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి  

Also Read: Hardik Pandya: థర్డ్ అంపైర్ కళ్లు మూసుకున్నారా..? పాండ్యా ఔట్‌పై వివాదం.. ఇషాన్ కిషన్ రివేంజ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More