Home> ఏపీ
Advertisement

TDP PLAN: డిసెంబర్ లో టీడీపీ తొలి జాబితా.. జనవరిలో లోకేష్ పాదయాత్ర!

TDP PLAN: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు వివిధ కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసింది టీడీపీ. జగన్ హవాతో ఎవరూ ఊహించని విధంగా కేవలం  23 సీట్లకే పరిమితమైంది.

TDP PLAN: డిసెంబర్ లో టీడీపీ తొలి జాబితా.. జనవరిలో లోకేష్ పాదయాత్ర!

TDP PLAN: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు వివిధ కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసింది టీడీపీ. జగన్ హవాతో ఎవరూ ఊహించని విధంగా కేవలం  23 సీట్లకే పరిమితమైంది. అందులోనూ ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. 2019 షాక్ నుంచి తేరుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయం పట్టిందని అంటారు. కొన్ని రోజులుగా స్పీడ్ పెంచిన టీడీపీ అధినేత.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు పొత్తుల అంశంలో రకరకాల చర్చలు సాగుతున్నా.. మరోవైపు చంద్రబాబు తన పని తాను చేసుకుని పోతున్నారని తెలుస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి అభ్యర్థులను ముందే ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఆయన ఖరారు చేశారు.

ఇటీవల జిల్లాలు,  నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు చంద్రబాబు. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఈ లెక్కనే డిసెంబర్ లోనే తొలి జాబితా విడుదల చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న 18 మంది సిట్టింగులకు మళ్లీ టికెట్ ఇస్తానని చంద్రబాబు అధికారికంగానే ప్రకటించారు. వీళ్లతో పాటు మరికొందరి పేర్లతో డిసెంబర్ లో తొలి జాబితా విడుదల చేయనున్నారని సమాచారం. 50 నుంచి 70 మందితో కూడిన జాబితా ఇవ్వవచ్చంటున్నారు. నిజానికి దాదాపు వంద నియోజకవర్గాలకు ఇప్పటికే చంద్రబాబు అభ్యర్థులను ఫైనల్ చేశారని తెలుస్తోంది. అయితే పొత్తులు కుదిరితే మళ్లీ సమస్య  వచ్చే అవకాశం ఉండటంతో.. పొత్తులు కుదిరినా సమస్య ఉండదు అనుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే ప్రకటించనున్నారని టీడీపీ వర్గాల సమాచారం.  సిట్టింగులతో పాటు మాజీ మంత్రులు.. నియోజకర్గంలో పోటీ లేకుండా ఉన్న నేతల పేర్లు ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది.

ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహుర్తం ఫిక్సైంది. సంక్రాంతి తర్వాత ఆయన పాదయాత్ర మొదలు కానుంది. నిజానికి ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం కావడంతో అక్టోబర్ 2 నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ముందస్తుకు అవకాశం లేదన్న అంచనాతో వాయిదా వేసుకున్నారు. జనవరిలో మొదలు కానున్న లోకేష్ పాదయాత్ర.. దాదాపు 450 రోజులు సాగనుంది.  2024 మార్చి వరకు లోకేష్ జనంలోనే ఉండనున్నారు. అన్ని జిల్లాల్లో సాగనున్న లోకేష్ యాత్రలో దాదాపు అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా రూట్ మ్యాప్ రూపొందించారని తెలుస్తోంది. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ.. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ లోకేష్ ముందుకు వెళ్లనున్నారు. పార్టీ పరిస్థితులు అంచనా వేస్తూ బలహీనతలను అధిగమించేలా కసరత్తు చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా లోకేష్ పాదయాత్రలో ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది.లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేసే బాధ్యతను పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జులుగా అప్పగించారు చంద్రబాబు.

Also Read: 49 ఏళ్ల వయసులోనూ 'తగ్గదేలే'.. సచిన్‌ బ్యాక్‌ఫుట్‌ పంచ్‌కు దద్దరిల్లిన స్టేడియం!

Also Read:  Munugode Bypoll : మునుగోడులో కేసీఆర్ బీసీ అస్త్రం.. పీకే టీమ్ తాజా సర్వేతో మారిన వ్యూహం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Read More