Home> ఏపీ
Advertisement

యురేనియం తవ్వకాలపై స్పందించిన చంద్రబాబు

యురేనియం తవ్వకాల విషయంలో అప్పుడు వైఎస్సార్ చేసిన తప్పే ఇప్పుడు వైఎస్ జగన్ చేస్తున్నారు: నారా చంద్రబాబు నాయుడు

యురేనియం తవ్వకాలపై స్పందించిన చంద్రబాబు

హైదరాబాద్: యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఓవైపు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలు జరుపుతుంటే మరోవైపు ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు. యురేనియంపై తవ్వకాలకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి వైసీపీ నేతలు డుమ్మా కొట్టారని, ఆదివారం ఓబుళపల్లెలో జరిగే అఖిలపక్ష పోరాటానికి ప్రభుత్వ మద్దతు ఉందా? లేదా? అని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు నాయుడు.. గతంలో యురేనియం ప్లాంటుకు అనుమతులిచ్చి మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నల్లమలకు ముప్పు తీసుకొస్తే, ఇప్పుడు సీఎం జగన్‌ మళ్లీ అదే తప్పు చేసి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా యురేనియం తవ్వకాలు ఆపేయించాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపి పోరాడుతుందని చంద్రబాబు స్పష్టంచేశారు.

Read More