Home> ఏపీ
Advertisement

Chandrababu Naidu: చంద్రబాబు సంచలనం.. నడిరోడ్డుపై ప్రజల కోసం ఆపిన కాన్వాయ్‌

Chandrababu Naidu Stops Convoy On Road And Takes Meet To Public: ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాన్వాయ్‌ ఆపి స్వయంగా ప్రజలను కలిసి వినతులు స్వీకరించారు.

Chandrababu Naidu: చంద్రబాబు సంచలనం.. నడిరోడ్డుపై ప్రజల కోసం ఆపిన కాన్వాయ్‌

Chandrababu Naidu Convoy: పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకత చాటుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు కాకుండా సాధారణంగా.. సామాన్యుడిలా కనిపిస్తున్నారు. తాజాగా తన పర్యటనలో చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన నివాసం నుంచి సచివాలయం వెళ్తుండగా స్థానిక ప్రజలను చూసి ఆగిపోయారు. అక్కడ కాన్వాయ్‌ దిగి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.

Also Read: Vigilance Inquiry: జగన్‌ పాలనలోని అధికారులకు భారీ షాక్‌.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఉండవల్లిలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయం బయల్దేరారు. అయితే మార్గమాధ్యలో ప్రజలు కనిపించడంతో తన కాన్వాయ్‌ను ఆపివేయించారు. కాన్వాయ్‌ ఆపి ప్రజలను కలిశారు. కరకట్టపై ఉన్న ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు ముఖ్యమంత్రికి వివరించారు. 

Also Read: Revanth YS Sharmila: 2029లో ఏపీ సీఎంగా వైఎస్‌ షర్మిల.. ఇది తథ్యం: రేవంత్‌ రెడ్డి

వినతిపత్రాలు తీసుకున్న అనంతరం వారి సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.  స్వయంగా కారు దిగి వచ్చి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలు వినడంతో పాటు వారికి ధైర్యాన్ని నింపి అక్కడి నుంచి సచివాలయం బయలుదేరారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనీసం బయటకు వచ్చినా పోలీసులు ఇబ్బంది పెట్టారని ఈ సందర్భంగా స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

బాబుతో మాజీ ఎమ్మెల్యే కుటుంబం
ఇదే క్రమంలో నక్సలైట్ల చేతిలో దారుణ హత్యకు గురయిన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబసభ్యులు చంద్రబాబును కలిశారు. సోమ భార్య ఇచ్చావతి తన సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా తాము చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చంద్రబాబుకు వివరించారు. అయితే సోమ కుమారుడి చదువు బాధ్యత తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Read More