Home> ఏపీ
Advertisement

AP Ration Items: పేదలకు చంద్రబాబు గుడ్‌న్యూస్‌.. రేషన్‌ సరుకుల్లో బియ్యంతోపాటు చక్కెర, పప్పు

Andhra Pradesh Ration Card Holders Gets Rice Along With Sugar And Toor Dal From July: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్త వినిపించింది. రేషన్‌గా చక్కెర, పప్పు కూడా అందించనుంది.

AP Ration Items: పేదలకు చంద్రబాబు గుడ్‌న్యూస్‌.. రేషన్‌ సరుకుల్లో బియ్యంతోపాటు చక్కెర, పప్పు

AP Ration Items: అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త అందించింది. రేషన్‌ సరుకుల్లో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు కూడా అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెల నుంచే వాటిని బియ్యంతోపాటు అందించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఇది కేవలం తెల్ల రేషన్‌ కార్డుదారులకు మాత్రమే అందించనున్నారు.

Also Read: Sidda Raghava Rao: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో తొలి వికెట్‌

వచ్చే నెల జూలై 1వ తేదీ నుంచి తెల్ల రేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు అందించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ సరుకులు అందించనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్ల రేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. 

Also Read: Chandrababu: జగన్‌ నా కష్టాన్నంతా బూడిదలో పోశారు.. పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో కాదు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన హయాంలో రేషన్‌ సరుకుల్లో కోత విధించారు. ఏడాదిగా కందిపప్పు పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అధికారం మారడం.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చారు. రేషన్‌ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం లేదనే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు వాటి పంపిణీకి ఆదేశాలు ఇచ్చారు.

సీఎం ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రస్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు పంపారు. ఈనెల 20వతేదీ నుంచి రేషన్‌ షాపులకు బియ్యం, కందిపప్పు, మంచి నూనె‌ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయనున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో చక్కెర, కందిపప్పు నిల్వ చేశారు. వాటి నాణ్యతతోపాటు అక్కడికి వచ్చిన ప్యాకెట్లను తూకం వేసి అధికారులు పరిశీలించారు. వచ్చేనెల 1 నుంచి వీటిని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రేషన్‌ సరుకుల్లో కందిపప్పు, చక్కెర కూడా ఇస్తుండడంతో పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More