Home> ఏపీ
Advertisement

Chandrababu: వంద రోజుల చంద్రబాబు పాలన.. ఎమ్మెల్యేలకు భారీ షాక్‌ తగలనుందా?

Chandrababu Completes 100 Days As Chief Minister On Sept 20th: అధికారం ఉందని రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు భారీ షాకివ్వనున్నారు. ప్రధానంగా ముగ్గురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.

Chandrababu: వంద రోజుల చంద్రబాబు పాలన.. ఎమ్మెల్యేలకు భారీ షాక్‌ తగలనుందా?

Chandrababu 100 Days Rule: శాసనసభ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కానుంది. ఈనెల 20వ తేదీతో వంద రోజుల పాలన పూర్తవుతుండగా కూటమి పార్టీలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇదే క్రమంలో కొందరు ఎమ్మెల్యేలకు భారీ షాక్‌ తగలనున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించారు. ఇప్పటికే వారిని మందలించగా.. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళ లేదా బుధవారాల్లో టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం కానున్నారని సమాచారం.

Also Read: IPS Officers: హీరోయిన్ కాదంబరి జేత్వాని బిగ్‌ ట్విస్ట్‌.. ముగ్గురు పెద్ద ఐపీఎస్‌ ఆఫీసర్లు సస్పెండ్‌

 

గుజరాత్‌లోని గాంధీనగర్ పర్యటనకు సోమవారం సీఎం చంద్రబాబు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన అనంతరం సొంత పార్టీ ఎమ్మెల్యేలతో  ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారని చర్చ జరుగుతోంది. ఈనెల 20వ తేదీతో  వందల రోజుల పాలన పూర్తవడంతో.. పాలన, ఎమ్మెల్యే పని తీరుపై  చంద్రబాబు సమీక్షిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేను పిలిచి వివరాలు తెలుసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Also Read: YS Sharmila: ఆ విషయంలో చంద్రబాబు నోరు విప్పాలి.. ట్విటర్‌లో నిలదీసిన వైఎస్‌ షర్మిల

 

ముగ్గురిపై ఆగ్రహం
ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ఓ మహిళా ఎమ్మెల్యే భర్త తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వెంట వేసుకొని తిరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అతడిని హెచ్చరించే అవకాశం ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబు ఆగ్రహానికి గురవుతారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది.

నామినేటెడ్‌ పోస్టులపై దృష్టి
ఇక ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో చంద్రబాబు నాయుడు నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కూడా చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేస్తారని సమాచారం. ఇప్పటికే నామినేటెడ్ పదవుల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. మొదటగా 18 కార్పొరేషన్ చైర్మన్లు విడుదల చేస్తారని విశ్వసనీయ సమాచారం. మిగిలిన నామినేటెడ్ పదవులు దసరాలోపు పూర్తి చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More