Home> ఏపీ
Advertisement

Chandrbabau Case: చంద్రబాబుకు అదనపు షరతులు విధించనున్నారా, రేపు తేల్చనున్న ఏపీ హైకోర్టు

Chandrbabau Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుపై  కోర్టు ఆదేశాల ఉల్లంఘన ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకే అదనపు షరతులు విధించాలని సీఐడీ కోరుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
 

Chandrbabau Case: చంద్రబాబుకు అదనపు షరతులు విధించనున్నారా, రేపు తేల్చనున్న ఏపీ హైకోర్టు

Chandrbabau Case: ఏపీ స్కిల్ కేసులో ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ షరతుల్ని అప్పుడే ఉల్లంఘించేస్తున్నారని, అదనపు షరతులతో కట్టడి చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాల్ని కోర్టులో సమర్పించింది. 

ఏపీ స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ తరువాత చంద్రబాబు జైలు ఆవరణలోనే మీడియాతో మాట్లాడారు. దారిపొడుగునా అందరినీ పలకరిస్తూ 14 గంటలసేపు ప్రయాణించారు. దాంతో చంద్రబాబు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారంటూ సీఐడీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాజకీయ ర్యాలీ తీశారని, మీడియాతో మాట్లాడారంటూ అందుకు తగ్గ సాక్ష్యాల్ని పెన్ డ్రైవ్ రూపంలో కోర్టుకు సమర్పించింది సీఐడీ. వాస్తవానికి బెయిల్ మంజూరు కాగానే అదనపు షరతులు విధించాలని సీఐడీ అనుబంధ పిటీషన్ దాఖలు చేయగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు చంద్రబాబు మీడియాతో మాట్లాడకూడదని, ర్యాలీలు చేయకూడదని, కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని ఆదేశించింది. అయితే బెయిల్ నుంచి బయటకు రాగానే చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత ర్యాలీగా విజయవాడ చేరుకున్నారు. 

ఈ ఆధారాల్ని కోర్టుకు సమర్పించిన సీఐడీ అందుకే తాము ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు ఆయనతో ఉండేలా అదనపు షరతులు విధించాలని కోరుతున్నట్టు కోర్టుకు విన్నవించింది. చంద్రబాబు కోర్టు షరతులకు లోబడి వ్యవహరిస్తున్నారా లేదా, కేసు విచారణ దశలో ఉన్నందున దర్యాప్తు కోసమని తెలిపింది. అయితే అదనపు షరతులు విధించడం చంద్రబాబు ప్రాధమిక హక్కులకు భంగం కల్గించడమేనని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు అదనపు షరతుల విషయంలో నవంబర్ 3న నిర్ణయం వెలువరిస్తామని తెలిపింది. 

Also read: MLA Thopudurthi Prakash Reddy: న్యాయం గెలిచిందా..? రోగం గెలిచిందా..? చంద్రబాబు బెయిల్‌పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More