Home> ఏపీ
Advertisement

ఆయేషా మీరా కేసులో సీబీఐ ముందడుగు: ముగ్గురిపై కేసు నమోదు ?

Ayesha meera murder case : బీఫార్మసీ విద్యార్ధి ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

ఆయేషా మీరా కేసులో సీబీఐ ముందడుగు: ముగ్గురిపై కేసు నమోదు ?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హ్యత్య కేసులో సీబీఐ ముందడుగు వేసింది. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తూ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ప్రముఖ మీడియాలో కథనం వెల్లడైంది. ఈ మీడియా కథనం ప్రకారం ఆయేషా హత్య కేసుకు సంబంధించి కోర్టులో ఉన్న కీలకమైన పత్రాలు మాయమైనట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో కోర్టు సిబ్బందిలోని ముగ్గురిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో మరికొందరిపై కూడా కేసు నమెదు చేసే అవకాశమున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీబీఐ దూకుడుతో అసలు దోషుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు ఈ సీబీఐ చర్యలపై ఆయేషా మీరా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

ఆయేషా తల్లిదండ్రుల పోరాటం ఫలించిన వేళ

సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంటే.. 2007 డిసెంబర్ 26 రాత్రి బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్య జరిగింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం సమీపంలోని హాస్టల్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆయేషా మీరాపై అత్యాచారం చేసి..అనంతరం ఆమెను అంత్యంత కిరాతంగా చంపేసి బాతురూంలో పడేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు..  కృష్ణా జిల్లాకు నందిగామాకు చెందిన సత్యంబాబును దొషిగా పేర్కొంటూ అతన్ని జైలు కు పంపించారు. అయితే ఈ కేసులో అసలు దోషి సత్యం బాబు కాదని..బడాబాబుల హస్తముందని పేర్కొన్న ఆయేషా మీరా తల్లిదండ్రులు..దీనిపై న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారు హైకోర్టు గుమ్మం ఎక్కారు. సుదీర్ఘకాలం పాటు అనేక కోణాల్లో విచారణ జరిపిన కోర్టు సత్యంబాబును నిర్దోషిగా తేల్చింది. కోర్టు ఉత్తర్వులతో  2017లో ఈ కేసులో శిక్ష అనుభవించిన సత్యంబాబు బయటికి వచ్చాడు. 

కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ

ఆయేషా మర్డర్ పదేళ్ళు గడిచిపోయినా ఈ  కేసులో స్థానిక పోలీసులు ఏమీ తేల్చలేకపోయారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కీలకమైన ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ తనదైన శైలిలో విచారణ ప్రారంభించింది.  ఈ క్రమంలో ఈ  కేసుకు సంబంధించి కోర్టులో ఉన్న పలు కీలక రికార్డులను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ముగ్గురు నిందితులుపై  సీబీఐ కేసు మోదు చేసింది. 

Read More