Home> తెలంగాణ
Advertisement

ఆదిలోనే రేవంత్ కు టి.కాంగ్రెస్ నేతల చెక్

ఆదిలోనే రేవంత్ కు టి.కాంగ్రెస్ నేతల చెక్

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికతో ఆయనకు పెరిగిన ఇమేజ్ ను పార్టీ నేతలు భరించలేకపోతున్నారా ? రాహుల్ గాంధీతో సభ నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలు లోలోపల టెన్షన్ పడుతున్నారా ? అసలు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ను ఎందుకు వాయిదా వేస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాల  కోసం ఈ కథనాన్ని చదవండి.

టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డి ..తన అనుచరగణంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన చేరికతో కాంగ్రెస్ బలంపుంజుకున్న విషయాన్ని ఆ పార్టీకి చెందిన నేతలే ధృవీకరిస్తున్నారు. ఇదే సందర్భంలో రేవంత్ కు రోజు రోజుకు తెలంగాణలో హైప్ పెరుగుతూ వస్తోంది.  ఇక్కడే వచ్చింది అసలు సమస్య. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన రేవంత్ ను ఇలాగే వదిలేస్తే తమకు అందాల్సిన పదవులు దక్కవనే భయం టి.కాంగ్రెస్ నేతల్లో పట్టుకుంది. దీనిపై పలువురు నేతలు లోలోపల మధనపడుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ తో సభ నిర్వహించాలని భావిస్తున్న రేవంత్ కు ప్రత్యక్షంగా కాకపోయినా..పరోక్షంగా అడ్డుతగులుతున్నట్లు రాజకీయవర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి

టి.నేతలకు రేవంత్ భయం..

రాహుల్ తో కనుక సభ నిర్వహిస్తే.. రేవంత్ ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోతుందని..అప్పుడు రేవంత్ కనుసైగల్లో పార్టీ నడిచే పరిస్థితి ఉత్పన్నమౌతుందనే ఆత్మరక్షణ స్థితిలో టి.కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. అదేమంటే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. అయితే అసలు కారణం రేవంత్ భయమే.

కాంగ్రెస్ సముద్రంలో రేవంత్ ఈదగలరా ?

రాహుల్ సభ విషయంలో టి.కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ..   ఎలాగైనా ఈ నెల చివర్లో రాహుల్ ను తెలంగాణకు రప్పించి బహిరంగ సభ నిర్వహించాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. రాహుల్ తెలంగాణలో పర్యటిస్తారా లేదా అన్నది తర్వాతి విషయం.. ఆదిలోనే రేవంత్ కు ఈ స్థాయిలో చెక్ పెడుతుంటే..రానున్నకాలంలో రేవంత్ ఎలా తట్టుకుంటారనేదే ఇక్కడ గమనించదగిన అంశం. సముద్రంలాంటి కాంగ్రెస్ లో గజఈత గాడిలా రేవంత్ ఈదగలడా.. అన్నదే ఇక్కడ ఉత్పన్నమైన ప్రశ్న. 

Read More