Home> ఏపీ
Advertisement

Chandrababu Naidu: మాజీ సీఎం ఇంటికి మళ్లీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ  (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.

Chandrababu Naidu: మాజీ సీఎం ఇంటికి మళ్లీ నోటీసులు

warning notices to Chandrababu Naidu's house: అమరావతి: ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. అయితే.. కృష్ణానది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసి.. అధికారులు ముంపు బాధితులను పునరావస కేంద్రాలకు (Rehabilitation centers) తరలిస్తున్నారు. ఈ మేరకు విజయవాడలో నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇంకా ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం వరకు కరకట్ట లోపల వైపు ఉన్న భవనాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) భవనంతో సహా 36 భవనాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఇంటి ముందు ఉన్న పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌కు నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు అంటించారు. Also read: Vellampalli Srinivas: ఏపీ దేవాదాయశాఖ మంత్రికి కరోనా!

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ప్రాజెక్టులోని ఇన్‌ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో దిగువకు భారీ ప్రవాహం కొనసాగుతుండటంతో.. కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్‌ పలు పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ మేరకు కలెక్టర్, అధికారులు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలాఉంటే.. గతేడాది కూడా కృష్ణా నదికి వరద పోటెత్తడంతో.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.   Also read: ఏపీ సీఎం YS Jaganకు ధన్యవాదాలు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Read More