Home> ఏపీ
Advertisement

ఆంధ్రాకు 200 ప్రత్యేక బస్సు సర్వీసులు

ఆంధ్రాకు 200 ప్రత్యేక బస్సు సర్వీసులు

ఆంధ్రాకు 200 ప్రత్యేక బస్సు సర్వీసులు

బెంగళూరు: దసరా పండగ రద్దీ దృష్ట్యా తెలుగు వారు అధిక సంఖ్యలో ఉన్న బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ పట్టణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఏటీఎం ఎన్‌.గోపీనాథ్‌ తెలిపారు. అకోబర్ 1 మంగళవారం నుంచి 6వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. బెంగళూరులోని మెజస్టిక్‌ బస్టాండ్‌, ఐటిఐ గేట్‌ (దూరవాణినగర్‌), హెబ్బాళ్‌, మారతహళ్ళి, విద్యారణ్యపుర ప్రాంతాల నుంచి బస్సులు బయల్దేరతాయని గోపినాథ్ వెల్లడించారు. 

బెంగళూరు నుంచి విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, కావలి, కనిగిరి, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ఆళ్ళగడ్డ, ప్రొద్దుటూరు మార్గాల మధ్య ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామన్నారు. ఆన్‌లైన్‌లోనూ టికెట్‌ బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం 9945516545/43/44 మొబైల్ నెంబర్లకు ఫోన్ చేసి ఇతర వివరాలు అడిగి తెలుసుకోవచ్చునని తెలిపారు.

Read More