Home> ఏపీ
Advertisement

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకుంటే జరిమానా...క్లారిటీ ఇచ్చిన APSRTC..

APSRTC: బస్సుల్లో మాస్కు ధరించకుంటే జరిమానా ప్రచారంపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. బస్సుల్లో మాస్కు లేకుంటే జరిమానా వేయడం లేదని స్పష్టం చేసింది.
 

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకుంటే జరిమానా...క్లారిటీ ఇచ్చిన APSRTC..

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని.. లేకుంటే రూ. 50 జరిమానా వేస్తారంటూ ఓ వార్త నెట్టింట హాల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో..దీనిపై తాజాగా ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కీలక ప్రకటన చేసింది. బస్సుల్లో మాస్కు లేకుంటే జరిమానా వేయడం లేదని స్పష్టం చేసింది. అయితే బస్సుల్లో మాస్కు ధరించాలని చెబుతున్నట్లు పేర్కొంది. 

బస్టాండ్లలో బస్సులకు అడ్డంగా బైకులు పెట్టడం, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపి ఉంచిన వారికి, బహిరంగ మూత్ర విసర్జన, మాస్కులు లేకుండా తిరిగే వారికి అధికారులు ఫైన్స్ (Fines) వేస్తున్నారని.. బస్సుల్లో మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి జరిమానా విధించడం లేదని ఆర్టీసీ ఎండీ  చెప్పుకొచ్చారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాస్కు ధరించాల్సిందిగా సూచిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ బ్రహ్మానందరెడ్డి (APSRTC MD Brahmanandareddy) తెలిపారు. 

Also Read: AP Night Curfew: ఏపీలో ఇవాళ్టి నుంచి నైట్‌ కర్ఫ్యూ, విద్యాలయాల మూసివేతపై..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 984 కొవిడ్ పాజిటివ్ కేసులు (Corona Cases in AP) వచ్చాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,82,843కి చేరాయి. వైరస్ తో ఎవరూ మృతి చెందలేదు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505గా ఉంది. కరోనా నుంచి 152 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 5,606 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More